పవన్ కల్యాణ్ OGలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 బ్యూటీ.. స్టోరీ లీక్‌ చేసిన IMDB!

పవన్ కల్యాణ్ ఓవైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉంటునే.. మరోవైపు సినిమాల్లో నటిస్తున్నారు. ఇక ఆయన నటిస్తున్న చిత్రాల్లో ఓజీ ఒకటి. ఇక ఈ సినిమాను రన్ రాజా రన్, సాహో చిత్రాలు తెరకెక్కించిన సుజిత్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా స్టోరీని ప్రముఖ పాపులర్ సినిమా వెబ్‌ సైట్‌ 'IMDB' లీక్ చేసింది. అంతే కాదు ఈ సినిమాలో బిగ్ బాస్ తెలుగు సీజన్ బ్యూటీ ఓ కీలక పాత్రలో నటిస్తుందట. ఆ వివరాల్లోకి వెళితే...

పవన్ కల్యాణ్ ఫుల్ లెంగ్త్ మూవీ వచ్చి చాలా కాలమే అయింది. ఇక ఇటీవల బ్రో సినిమాతో కాస్త ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చిన పవన్... ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇక ఆయన నటిస్తున్న చిత్రాల్లో ఓజీ ఒకటి. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమా టీజర్ ఇటీవల రిలీజ్ అయి... ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇచ్చింది. ఇక టీజర్ లో పవన్.. ఎలివేషన్స్ మామూలుగా లేవు. ఇక ఈ సినిమా కోసం ఫ్యాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు.

Pawan Kalyan OG Movie

పవన్ ఓజీ ట్రైలర్ పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా పక్క హిట్.. బాక్సాఫీస్ వద్ద పెను సంచలనం కన్ఫార్మ్ అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ లైన్‌ను ఐఎమ్‌డీబి అఫీషియల్‌ వెబ్‌ సైట్‌ లో రాసుకొచ్చి స్టోరీ మొత్తం లీక్ చేసింది. ఇక చూసిన నెటిజన్స్... ఓజీ స్టోరీ ఇదే అంటూ ట్రెండ్ చేస్తున్నారు.

Pawan Kalyan OG Movie

ఇక ఐఎండీబీ రాసుకొచ్చిన కథ ప్రకారం.. ఓజాస్‌ గంభీర అనే ఓ టూరిస్ట్‌ బాయ్‌ అనుకోకుండా బాంబేకు వచ్చి అక్కడ గ్యాంగ్‌స్టర్‌ గా మారతాడట. క్రైమ్, మాఫియాలలో రారాజుగా ఎదుగే ప్రయాణంలో తన కుటుంబాన్ని పొగట్టుకుంటాడు. దాంతో తన ఫ్యామిలీని అంతమొందించిన వారిని చంపడానికి రివేంజ్ కోసం.. ఎదురుచూస్తాడు. కేవలం చంపడమే కాకుండా ఆ విలన్‌ ల సమ్రాజ్యాన్ని కుప్పకూలుస్తాడట. వాళ్లు చేసే ఇల్లీగల్‌ దందాలన్నిటిని కూకటి వేల్లతో పెకలించేస్తాడు' అంటూ IMDB రాసుకొచ్చింది.

Pawan Kalyan OG Movie

ఇక ఓజీ కథలో ఎంత నిజముందో తెలియదు.. కానీ ఈ స్టోరీ నెట్టింట వైరల్ గా మారింది. ఇదే నిజమైతే స్టోరీలో కొత్తదనం లేదంటున్నారు నెటిజన్స్. ఇలాంటి కథలు చాలా చూశామని చెబుతున్నారు. ఓజీ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌ పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహారిస్తున్నారు.

Shubha Sree

ఇక ఓజీ సినిమా నుంచి మరో న్యూస్ బయటకు వచ్చింది. ఇటీవల బిగ్ బాస్ ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బిగ్ బాస్ బ్యూటీ శుభ శ్రీ నటించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. పవన్‌ కల్యాణ్‌ తో స్క్రీన్‌ షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది శుభ శ్రీ రాయగురు. ఇంతకీ తాను ఎలాంటి పాత్రలో కనిపిస్తాననేది మాత్రం చెప్పలేదు. దీంతో ఈ బ్యూటీ ఓజీలో నటిస్తోందని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X