ఒకే రోజు ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ స్పెషల్ వీడియో.. ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే మేటర్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తన షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేసుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం హరి హర వీరమల్లు చిత్రం విడుదలకు సిద్ధమైంది. కాగా పవన్ కళ్యాణ్ రాబోయే చిత్రాలు ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాల నుంచి ప్రత్యేక వీడియోలను అభిమానుల కోసం విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..
గ్రాండ్ గా హరి హర వీరమ్లలు రిలీజ్ ఏర్పాట్లు..
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అభిమానులు హరి హర వీరమల్లు చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ లో 250 కోట్ల రూపాయాలతో నిర్మించారు. ఏఎం రత్నం నిర్మాతగా వ్యవహరించారు. ఏఎం జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. బాబీ డియోల్ విలన్ గా అలరించబోతున్నారు. ఇక ఈ చిత్రం జూలై 24న విడుదల కాబోతోంది. 21న ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరనుంది. ఈ చిత్రం ప్రీమియర్స్, రిలీజ్ కు సంబంధించిన ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్నాయి.

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు ట్రీట్..
ఇప్పటికే పవన్ కళ్యాణ్ అభిమానులకు హరి హర వీరమల్లు చిత్రం పండగ వాతవారణాన్ని తెచ్చి పెట్టింది. దాంతో హరి హర వీరమల్లు సినిమాకు సంబంధించి రిలీజ్ ఏర్పాట్లలో అందరూ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ అభిమానులకు మరో గుడ్ న్యూస్ వచ్చేసింది. పవన్ కళ్యాణ్ రాబోయే చిత్రాలు ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి కూడా అప్డేట్స్ రాబోతున్నాయి. సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ రెండు చిత్రాల నుంచి ఒకేసారి అప్డేట్స్ రాబోతున్నాయని తెలుస్తోంది.
ఒకే రోజు రెండు వీడియోలు..
ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం నుంచి గతంలో ఓ ఎనర్జిటిక్ గ్లింప్స్ విడుదలైంది. ఇక నెక్ట్స్ సెప్టెంబర్ 2న ఈ చిత్రం నుంచి పవర్ ఫుల్ డైలాగ్స్ తో కూడిన ప్రత్యేకమైన వీడియోను విడుదల చేసేందుకు హరీశ్ శంకర్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఓజీ చిత్రం నుంచి కూడా వీలైతే టీజర్ ను లేకపోతే సాలిడ్ యాక్షన్ గ్లింప్స్ ను వదిలే ప్రయత్నం జరుగుతున్నదని గాసిప్. ఇక ఆ రోజు ఏం వస్తుందనేది చూడాలి.
హరి హర వీరమల్లు స్పెషల్ గా..
పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా ప్రభంజనం సృష్టించిన తర్వాత తొలిసారిగా వెండితెరపైకి రాబోతున్న చిత్రం హరి హర వీరమల్లు సినిమా కావడం విశేషం. దీంతో ఈ ఈ సినిమా అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులకు మరింత స్పెషల్ గా మారింది. ఇక ఈరోజు జూలై 21న చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లోని శిల్ప కళా వేదికలో గ్రాండ్ గా నిర్వహించనున్నారు.


Click it and Unblock the Notifications











