ఆ దర్శకుడికి 12 కోట్లు ముట్టజెప్పిన పవన్ కళ్యాణ్..!??
వరుస పరాజయాలతో మూలపడిన వైవిఎస్ చౌదరిని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిలిచి మరీ 12కోట్ల రూపాయల చెక్ ఇచ్చాడని గుసగుస వినిపిస్తోంది. అయితే పవన్ 12కోట్లు ఇచ్చింది వైవిఎస్ ప్రతిభాపాటవాలకు పారితోషకంగా కాదట. చిరంజీవి సోదరి కుమారుడు తేజ హీరోగా పరిచయం చేస్తూ ఓ చిత్రాన్ని రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారన్న వార్తలు గతంలో వినిపించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఆ చిత్రం ఇలా వైవిఎస్ చేతులు మీదుగా తెరకెక్కబోతోందట. సినిమా బడ్జెట్ 12 కోట్లుగా నిర్ణయించి మొత్తం వ్యవహారాలన్ని చూసుకోమని స్పష్టం చేసి మరీ చెక్ ఇచ్చాడట త్వరలోనే ఈ చిత్రం ప్రారంభం కానుంది. ఈ చిత్రం ద్వారా కొత్త హీరోయిన్ నే పరిచయం చేస్తున్నాడట వైవిఎస్.
అయిన్ పవన్ చిత్రాన్ని స్వియ నిర్మాణసారథ్యంలో రూపొందిస్తాడని వినికిడి. ఈ చిత్రానికి 'కృష్ణా ముకుందా మురారి' అనే టైటిల్ పరిశీలనలో ఉందంట! విదేశాలలో ఆల్రెడీ షూటింగ్ సైతం ప్రారంభించారని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. కొత్త అమ్మాయిని హీరోయిన్‌గా పరిచయం చేయబోతున్నట్టు చౌదరి చెప్పుకొస్తున్నాడు. అక్కమీద ప్రేమతో...తన మేనల్లుణ్ని హీరో చేయడం కోసం ఈ చిత్రానికి పరోక్షంగా సహకారం అందిస్తున్నాడంట.


Click it and Unblock the Notifications











