కేక పెట్టిస్తోన్న పవన్ ‘పంజా’..పవర్ ఫుల్ డైలాగ్..!?
తమిళ దర్శకుడు విష్ణు వర్దన్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా సినిమాకు 'పంజా' అనే టైటిల్ ను కన్ ఫార్మ్ చేశారు. ఈ సినిమాకు కాళి అనీ, షాడో అని రకరకాల టైటిల్స్ వినిపించినా నిర్మాతలు ఫైనల్ గా 'పంజా" అనే టైటిల్ ను కన్ఫరం చేశారు. అర్కా మీడియా బ్యానర్ పై ఈ సినిమాను శోభు యార్లగడ్డ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
పవన్‌కల్యాణ్ "పంజా" పబ్లిసిటీలో భాగంగా మూవీ టైటిల్, మూవీ స్టిల్స్ రిలీజ్ చేసారు. టైటిల్ మాస్ ను అలరించి ఆకట్టుకునే విధంగా వుంటే, స్టిల్స్ స్టైలిష్‌గా వున్నాయి. వీటికి మంచి స్పందనలభిస్తోంది. అలాగే ఈ సినిమాపై అంచనాలు కూడా పెంచుతున్నాయి. మాస్ స్టైలిష్ మూవీ అనే ఫీల్ క్రియేట్ చేసింది. మూవీ ట్రైలర్స్..ఆడియో కోసం ఆత్రంగా ఎదురుచూసేలా చేసాయనే చెప్పవచ్చు. కొత్తదనం, మాస్ వుంది. ఎంటర్ టైన్ మెంట్ మిస్ అవ్వలేదంటున్నారు కాబట్టి, ఆ ఎంటర్ టైన్ మెంట్ ఏ విధంగా ఉంటుందో అని అప్పుడే చర్చలు మొదలెట్టేశారు.
ఇక తాజాగా పంజా" చిత్రానికి సంబంధించిన ఓ డైలాగ్ పలువెబ్ సైట్స్ లో చక్కర్లు కొడుతోంది. మాంచి కిక్ ఇచ్చే ఈ డైలాగ్ మెగా అభిమానులతో పాటు థియేటర్ లోని ప్రేక్షకులను కూడా చప్పట్లు కొట్టిస్తుందని చెప్పొచ్చు. 'నా స్పీడ్ కు మా అన్నయ్యే అడ్డు వేయలేక పోయాడు...ఇక మీరేంటిరా వేసేది" అనేది ఆ డైలాగ్. ఈ చిత్రానికి అబ్బూరు రవి డైలాగ్స్ అందిస్తున్నారు. సంగీతం యువన్ శంకర్ రాజా.


Click it and Unblock the Notifications











