పవన్ కళ్యాణ్ తో ‘పంజా’ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ...!

By Sindhu

'కొమరం పులి' తర్వాత చాలా వేగంగా 'తీన్ మార్' సినిమా చేసిన పవన్ ...అంతే వేంగంతో 'పంజా' సిపనిమాని అభిమానుల ముందుకు తీసుకొచ్చాడు. ఇంకేముంది...ఇదే జోస్ కొనసాగిస్తూ పవన్ చకచకా ఏడాదికి రెండు సినిమాల చేస్తాడని అనుకున్నారంతా..అయితే చకచకా సినిమాలు చేసేయడం తనవల్ల కాదనీ ఎక్కువ నటిస్తే అలిసిపోతాననీ పవన్ రీసెంట్ పంజా ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. దాంతో, గబ్బర్ సింగ్' సినిమా తొందరగా వస్తుందా..?ఆ సినిమా తొందరగా వచ్చేస్తే ఆ తర్వాతి సినిమాకి పవన్ ఎక్కువ గ్యాప్ తీసుకుంటాడా..? అనే అనుమానాలు పెరిగిపోయాయి.

పంజా గురించి తన అభిప్రయాన్ని చెప్తూ 'నా అభిప్రాయం ఇది.. నేను దీనిని సపోర్ట్ చేస్తున్నాను.. నేను దానిని సపోర్ట్ చేస్తున్నాను.. అని చెప్పడం ఈజీ.. అది నాకిష్టం లేదు. (ఉదాహరణకు: నేను అన్నా హజారేకు సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పడం వలన ఉపయోగం ఏమిటి? నేను వెళ్ళి ఆయనతో పాటు కూర్చుంటే అది అసలయిన పద్దతి. చేతనయితే అలా చెయ్యాలి. లేకపొతే మౌనంగా వుండాలి. కేవలం అభిప్రాయాలు చెప్పడం వలన ఏమీ ఉపయోగం లేదు. ఇది పవన్ కళ్యాణ్ అభిప్రాయం). దీని ప్రకారం చూస్తే పవన్ కళ్యాణ్ ఎవ్వరినీ కామెంట్ చేయడంలేదు తనను తాను ప్రశ్నించుకొంటున్నాడు. ఇంటర్వ్యూలో పంజాపై నా అభిప్రాయం చెప్పడం వలన ఉపయోగం ఏమిటి? నా అభిప్రాయం ఎవరికి అవసరం? అనే ప్రశ్నలు కూడా ఉదయించాయి.

ఏదైనా నా అంతట నేను తెలుసుకొవాలే తప్ప నాకు ఒకరు చెపితే నాకు అర్దం కాదు అని తనదైన శైలిలో సమాదానం చెప్పారు. సినిమా ఫలానా ఫార్మాట్ లోనే చేయాలంటే తనకిష్టం వుండదనీ,..హిట్టొచ్చినా, ప్లాపొచ్చినా వెరైటీ లుక్ పైనే ఎక్కువ ఫోకస్ పెడ్తాననీ' పవన్ చెబుతుండగా, 'పంజా2 సినిమా అనంతరం కూడా పవన్ పక్కా కమర్షియల్ సినిమా..అదీ మాస్, క్లాస్ మెచ్చే పవన్ ట్రేడ్ మార్క్ ఎంటర్ టైన్మెంట్ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి, పవన్ అభిమానుల ఆశలకు తగ్గట్టు తదుపరి సినిమాలు ప్లాన్ చేసుకుంటాడా..?ఎక్కువ సినిమా చేయలేనిన చెప్పిన పవన్ ఆ మాట పక్కన పెట్టి, అభిమానలు కోసం చకచకా సినిమాలు చేస్తాడా..? అనేది 'గబ్బర్ సింగ్' సినిమాతో దాదాపుగా ఓ ఐడియా వచ్చేస్తుంది. అప్పటిదాకా మెగా ఫ్యాన్స్ కి సస్పెన్స్..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X