ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్ ల రికార్డులపై పవన్ పంజా..!

By Sindhu

జాని చిత్రంతో అత్యధిక ధియేటర్లలో సినిమాని విడుదలచేసి వారం రోజుల్లోనే క్యాష్ చేసుకోవాచ్చనే విధానాన్ని మొదలు పెట్టిన పవన్ కళ్యాణ్ మరోసారి అత్యధిక థియేటర్లలో తన 'పంజా" విసరబోతున్నాడు. అభిమానుల ఊహలకు అందనిరీతిలో సరికొత్త పంధాలో విష్ణువర్థన్ తెరకెక్కిస్తున్న 'పంజా" చిత్రాన్ని అత్యధిక ప్రింట్లతో థియేటర్లలో విడుదల చేయడానికి నిర్మాతలు అప్పుడే ప్రయత్నాలు మొదలు పెట్టేశారు.

అంతే కాదు పవన్ కళ్యాణ్ 'పంజా' నిర్మాతలు పబ్లిసిటీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడమే కాదు, ఈ సినిమాను తమిళ్ లోకి డబ్ చేసి తెలుగుతో పాటే రిలీజ్ చేయబోతున్నారట. తమిళ్ హిరోలంతా మన తెలుగుసినిమా ఇండస్ట్రీలో మంచి పట్టు సంపాదించారు. మన తెలుగు హీరోలు మాత్రం తమిళ్ లో అటువంటి పట్టు సంపాదించ లేకపోయారు. అల్లు అర్జున్ మాత్రం కేరళలో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. మన పవన్ కళ్యాణ్ పనిచేసేది ఎక్కువ తమిళ్ డైరక్టర్స్ తో అయినా తమిళ్ మార్కెట్ లో సాధించింది ఏమి లేదు.

దర్శకుడు విష్ణువర్దన్ ఒక్కడు మాత్రమే తమిళ్ కాదు, మ్యూజిక్ డైరక్టర్ యువన్ శంకర్ కూడా తమిళవారు కావడం ఈ సినిమాకు ఎడ్వాంటేజ్ అంటున్నారు. అంతే కాదు 'వాలి' ఫేం 'అజిత్' పవన్ కళ్యాణ్ కు తమిళ్ డబ్బింగ్ మూవీలో వాయిస్ అందించడం అక్కడ ఈ సినిమాకు ప్లస్ అవుతుందంటున్నారు.

మరి పంజా ఆడియోను నవంబర్ 2న విడుదలకాబోతుండగా డిసెంబర్ 8న పవన్ పంజా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగు, తమిళంలో రాబోతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రం, తమిళ్ సంగతి తర్వాత ముందు తెలుగులో హిట్ అయితే చాలు అనుకునే అభిమానులు వున్నా, తెలుగు సినిమాను వేరే రాష్ట్రాలకు అలవాటు చేసి మార్కెట్ ను పెంచుకోవలసిన బాద్యత తెలుగు హిరోలపై వుంది. ఆ ప్రయత్నం చేస్తున్న పవన్ కళ్యాణ్ 'పంజా' నిర్మాతలు అభినందనీయులు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X