»   » అలసి పోయిన పవన్ కళ్యాణ్- మూడో భార్యతో పారిస్ ట్రిప్?

అలసి పోయిన పవన్ కళ్యాణ్- మూడో భార్యతో పారిస్ ట్రిప్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత కొన్ని రోజులుగా రాజకీయాల బాట పట్టి బిజీ బిజీగా గడిపిన సంగతి తెలిసిందే. జన సేన పార్టీ స్థాపన, ఆ తర్వాత ఎన్నికల సమయంలో బీజేపీ, తెలుగు దేశం పార్టీల తరుపున ప్రచారం చేస్తూ గడిపారు. ఆ రెండు పార్టీలు అధికారంలోకి రావడంతో పవన్ కళ్యాణ్ కష్టానికి తగిన ఫలితం లభించిందనే చెప్పొచ్చు.

ఇలా వరుస పొలిటికల్ షెడ్యూల్స్‌‍తో అలిసి పోయిన పవన్ కళ్యాణ్ మళ్లీ....సినిమాల్లో బిజీ కావాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో కాస్త రిలాక్స్ అయ్యేందుకు ఆయన ప్యారిస్ వెళ్లినట్లు తెలుస్తోంది. ఆయన వెంట మూడో భార్య అన్న, పిల్లలు కూడా వెళ్లినట్లు సమాచారం. అందుకే నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి కూడా హాజరు కాలేకపోయాడని టాక్. త్వరలో ఆయన 'ఓ మై గాడ్' తెలుగు రీమేక్ షూటింగులో పాల్గొనబోతున్నారు.

'ఓ మై గాడ్' తెలుగు వెర్షన్‌కు 'దేవ దేవం భజే' అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. గతంలో 'జల్సా' చిత్రానికి వాయిస్ ఓవర్ ఇచ్చినట్లుగానే 'దేవ దేవం భజే'చిత్రానికి కూడా మహేష్ బాబుతో వాయిస్ ఓవర్ ఇప్పించేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారట. ఇలా చేస్తే సెంటిమెంటు కలిసొస్తుందని, జల్సా మాదిరిగా ఈ చిత్రం కూడా పెద్ద హిట్టవుతుందని భావిస్తున్నారు. ఈ మేరకు మహేష్ బాబును ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారట.

Pawan Kalyan in Paris on a holiday!

తెలుగు నేటివిటికి తగినట్లు ఈచిత్రాన్ని మార్పులు చేస్తున్నారు. అందులో భాగంగా ఒరిజనల్ లో ఉన్న పరేష్ రావెల్ పాత్ర కు ఇద్దరు పిల్లలు ఉంటే..ఇక్కడ వెంకటేష్ కి ఇద్దరు చెల్లెళ్లు ఉండేలా మార్చారని తెలుస్తోంది. అలాగే పవన్ కళ్యాణ్ గెటప్ సైతం పూర్తి మార్పుతో ఉంటుందని,దానిపై కసరత్తు జరిగిందని చెప్తున్నారు. మొదట వెంకటేష్ తో షూటింగ్ మొదలు పెట్టి తర్వాత పవన్ తో ఫినిష్ చేస్తారు. ఈ మేరకు ప్రత్యేకమైన వీధి సెట్ ని వేసారు.

'ఓ మై గాడ్‌'కథ ఏమిటంటే... పరేష్ రావెల్ ఓ నాస్తికుడు. అతనికి యాంటిక్స్ షాప్ ఉంటుంది. ఓరోజు అతని వ్యాపారం భూకంపం దెబ్బకు నాశనమైపోతుంది. దాంతో అతను ఇన్సూరెన్స్ వారిని ఆశ్రయిస్తారు. అయితే వాళ్లు చేతులెత్తేసి... అది భగవంతుడు పని కాబట్టి తమకేం సభందం లేదని చెప్తారు. దాంతో కోపం తెచ్చుకున్న అతను భగవంతుడుపై కేసు వేస్తాడు. అప్పుడు భగవంతుడు వచ్చి ఏం చేస్తాడు అనేది మిగతా కథ.

English summary
After all the campaigning, the shootings and all the strain, there’s no one who deserves a holiday more than Pawan Kalyan and hence, he is off on a holiday to Paris with his family! Yes, Pawan Kalyan and his wife Anna along with the kids are all in Paris having a gala time right now.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu