ఇష్టమైన దర్శకుడి చేతికి మరొక పని పెట్టిన పవన్ కళ్యాణ్.. త్వరలోనే బిగ్ సర్‌ప్రైజ్‌

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకానొక సమయంలో సినిమాలకు దూరం కావాలని అనుకున్న విషయం తెలిసిందే. అయితే మళ్లీ రాజకీయాల్లో ఫలితాలు మారడంతో మళ్లీ తన ఆలోచనను మార్చుకున్నాడు. పార్టీని నడపాలి అంటే ఆర్థికంగా నిలదొక్కుకోవాలని పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ముందుగా అడ్వాన్సు ఇచ్చిన నిర్మాతలకు కూడా పవన్ కళ్యాణ్ సినిమాల కోసం డేట్స్ ఇచ్చేశాడు. ప్రస్తుతం వరుసగా నాలుగు సినిమాలు లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. ఇక భీమ్లా నాయక్ సినిమాను ఈ ఏడాది విడుదల చేయాలని అనుకున్నప్పటికీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో వచ్చే ఏడాదే జనవరి కి తీసుకురాబోతున్నారు.

సంక్రాంతి బరిలో ఇప్పటికే పెద్ద సినిమాలు ఉన్నాయి. అయినప్పటికీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇక భీమ్లా నాయక్ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ రాసిన విషయం తెలిసిందే. కేవలం డైలాగ్స్ మాత్రమే కాకుండా దగ్గరుండి డైరెక్టర్ సాగర్ చంద్ర పని తనాన్ని కూడా గమనిస్తున్నారు. ఆల్ మోస్ట్ త్రివిక్రమ్ సినిమాకు దర్శకత్వ పర్యవేక్షణలో చేస్తున్నారు. అని కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఇక అసలు మ్యటర్ లోకి వస్తే పవన్ కళ్యాణ్ ఇటీవల త్రివిక్రమ్ శ్రీనివాస్ కు మరొకరిని అప్పగించినట్లు తెలుస్తోంది. సాధారణంగా పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉండడం వలన సినిమాల విషయంలో ఎక్కువగా త్రివిక్రమ్ సలహా తీసుకుంటున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ పీకే క్రియేటివ్ వర్క్స్ అనే ప్రొడక్షన్ హౌస్ ను స్థాపించిన విషయం తెలిసిందే.

Pawan kalyan pk creative works upcoming projects im trivikram hands

అయితే ఆ సంస్థలో ఇప్పటికే వరుసగా సినిమాలు చేయడానికి కొన్ని ప్రణాళికలు రచించిన పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కు కూడా బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. వీలైనంత వరకు వెబ్ సిరీస్ లో అలాగే మీడియం బడ్జెట్ సినిమాలను కూడా నిర్మించాలని అనుకుంటున్నారట. కుదిరితే మరొక ప్రొడక్షన్స్ హౌజ్ తో కలిసి రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలతో కూడా సినిమాలు చేసేందుకు ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. నితిన్ తో మరొక సినిమా చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అలాగే పూర్తిగా కొత్త నటీనటులతో కూడా చిన్న బడ్జెట్ సినిమాలను చేసేందుకు ప్లాన్ చేయమని సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ కూడా తన శిష్యులకు అవకాశం ఇచ్చి సొంతంగా కథలను అందించే ఛాన్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

మరి ఆ ప్లాన్స్ ఎంతవరకు వర్కవుట్ అవుతాయో చూడాలి. ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు కోసం ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. హారిక హాసిని ప్రొడక్షన్లో సూపర్ స్టార్ తో సినిమా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇక మాటల మాంత్రికుడు ఈ ఏడాది నవంబర్ లోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలని అనుకుంటున్నాడు. ఇక వచ్చే ఏడాది సమ్మర్లో ఈ సినిమా షూటింగ్ ఫినిష్ అయ్యే అవకాశం ఉంది. ఇక ఆ సినిమా అనంతరం త్రివిక్రమ్ మరొక చిన్న సినిమాను తెరపైకి తేవాలని అనుకుంటున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X