Pawan ఫాన్స్ కు కొంచెం ఇష్టం కొంచెం కష్టం.. అదే జరిగితే ఇక పూర్తిగా సినిమాలకు దూరమే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క రాజకీయాల్లో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి వరుస సినిమాలను లైన్ లో పెట్టారు కానీ ఆ సినిమాలు ఎప్పుడు విడుదల అవుతాయి అనే విషయం మీద ఎవరు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. ఇప్పటికే అభిమానులు ఈ సినిమాల విషయంలో టెన్షన్ పెట్టుకుంటే ఇప్పుడు సరికొత్త టెన్షన్ పెట్టే విధంగా కొన్ని వార్తలు బయటకు వచ్చాయి. అసలు ఏంటా వార్తలు? ఇప్పుడు టెన్షన్ ఎందుకు? అనే వివరాల్లోకి వెళితే

సినిమాలకు గుడ్ బై

సినిమాలకు గుడ్ బై

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ- బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్లారు. ఆ ఎన్నికల్లో ఆయన పోటీ చేయకుండానే బయట నుంచి మద్దతు పలికారు. 2019 ఎన్నికల్లో మాత్రం జనసేన ఒంటరిగా పోటీ చేసింది. కానీ పవన్ సహా మిగతా నేతలు అందరూ ఓడిపోయారు.

ఒకే ఒక ఎమ్మెల్యే సీటు దక్కింది కాకపోతే తరువాతి కాలంలో ఆయన కూడా ఏపీలో అధికార పార్టీకి జై కొట్టారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికలకు వెళ్లే ముందు తాను ఇక రాజకీయాల్లోకి వెళుతున్నాను కాబట్టి సినిమాలకు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించారు.

సినిమాలకు గుడ్ బై

సినిమాలకు గుడ్ బై

కానీ ఎన్నికల్లో ఓడి పోవడంతో తిరిగి ఆయన సినీ రంగంలోకి ప్రవేశించారు. ఆ తర్వాత ఆయన చేసిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను నమోదు చేసుకున్నాయి. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. ఆయన ఆ సినిమాలన్నీ వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నారని తెలుస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ కాకుండా మిగతా అంతా కూడా నిర్మాతకు బడ్జెట్ రేంజ్ లోనే దొరుకుతుంది.

పూర్తి చేయాలని

పూర్తి చేయాలని

పవన్ కళ్యాణ్ స్టార్డం కారణంగా కలెక్షన్లు మాత్రం భారీ బడ్జెట్ సినిమాకు వచ్చినట్టు వస్తున్నాయని అంచనాలున్నాయి. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అది పూర్తయిన తర్వాత అతి తక్కువ కాలంలో సముద్రఖని దర్శకత్వంలో ఒక తమిళ సినిమా రీమేక్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. అది పూర్తయిన వెంటనే భవదీయుడు భగత్ సింగ్ సినిమా షూటింగ్ ప్రారంభించి పూర్తి చేయాలని భావిస్తున్నారు.

సినిమాలకు బ్రేక్

సినిమాలకు బ్రేక్

భవదీయుడు భగత్ సింగ్ తర్వాత పూర్తిగా ఆయన బ్రేక్ తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. అంటే ఆ సినిమా పూర్తి చేసే లోపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ ఎన్నికల మీద ఫోకస్ పెట్టడం కోసం బ్రేక్ తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఒకవేళ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం వస్తే పూర్తిగా సినిమాలకు బ్రేక్ ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదని పవన్ సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి.

సినిమాలకు పూర్తిగా దూరం

సినిమాలకు పూర్తిగా దూరం

పవన్ ఇటీవల జరిగిన ఒక సమావేశంలో తన ముందు మూడు ఆప్షన్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో భాగమైతే ఖచ్చితంగా ఆయన సినిమాలకు పూర్తిగా దూరం అవుతారని అంచనాలు వెలువడుతున్నాయి. పవన్ అభిమానులు ఒకపక్క ఆయన అధికారంలోకి రావచ్చనే విషయంలో సంతోషిస్తూనే సినిమాలకు దూరం అవుతారని విషయంలో బాధపడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X