రామ్ చరణ్ మూవీతో పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల్లోకి?

Recommended Video

Ram Charan-Trivikram Film In Pawan Kalyan's Production || Filmibeat Telugu

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైన సంగతి తెలిసిందే. ఇకపై నటించే ఉద్దేశ్యం లేదని, తన నుంచి సినిమాలు ఆశించ వద్దని పలు సందర్భాల్లో ఆయన స్పష్టం చేశారు. ఇకపై పూర్తిగా ప్రజాసేవకే అంకితమని, జనసేన పార్టీని మరింత బలోపేతం చేయడమే తన లక్ష్యమని ఇటీవల పార్టీ రివ్యూ మీటింగులో కూడా పవన్ కళ్యాణ్ వెల్లడించారు.

తాజాగా సమాచారం ప్రకారం... పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమా రంగంలోకి వస్తున్నారట. అయితే ఆయన వచ్చేది నటించడానికి కాదని, తన బతుకు బండి నడిచేందుకు సినిమా ప్రొడక్షన్లో కొనసాగే ప్రయత్నంలో భాగంగానే రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఓ ప్రముఖ ఆంగ్లపత్రికలో వచ్చిన కథనం అభిమానుల్లో చర్చనీయాంశం అయింది.

త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా నిర్మాణం?

త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా నిర్మాణం?

త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా నిర్మించాలనే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నారట. పవర్ స్టార్ ఇప్పటికే ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్' పేరుతో సొంత ప్రొడక్షన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. దీన్ని గ్రాండ్‌గా రీ లాంచ్ చేసే ఆలోచనలో ఉన్నారట.

రామ్ చరణ్‌‌కు ప్రపోజల్

రామ్ చరణ్‌‌కు ప్రపోజల్

త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయాలని రామ్ చరణ్‌కు ఓ ప్రపోజల్ పంపారని, సొంత బాబాయ్ నుంచి వచ్చిన ప్రపోజల్ కావడంతో మెగా పవర్ స్టార్ కూడా వెంటనే ఓకే చెప్పారని టాక్. ఆల్రెడీ త్రివిక్రమ్ కూడా తన వద్ద ఉన్న స్టోరీ పాయింట్ చెర్రికి చెప్పినట్లు సమాచారం.

ఈ ప్రాజెక్ట్ దాదాపుగా ఓకే అయినట్లేనా?

ఈ ప్రాజెక్ట్ దాదాపుగా ఓకే అయినట్లేనా?

రామ్ చరణ్-త్రివిక్రమ్ ప్రాజెక్ట్ దాదాపుగా ఒకే అయినట్లుగా మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ ఇద్దరూ తమ తమ కమిట్మెంట్లు పూర్తి చేసుకున్న తర్వాత దీనిపై ఫోకస్ పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరో వైపు మెగాస్టార్ చిరంజీవితో కూడా త్రివిక్రమ్ ఓ సినిమా కమిటైన సంగతి తెలిసిందే. ‘సైరా' తర్వాత చిరు... కొరటాల శివతో సినిమా చేయనున్నారు. దీని తర్వాత చిరు-త్రివిక్రమ్ మూవీ ప్రారంభం కానుంది.

రామ్ చరణ్, త్రివిక్రమ్ బిజీ బిబీ

రామ్ చరణ్, త్రివిక్రమ్ బిజీ బిబీ

రామ్ చరణ్ ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ‘RRR' మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. త్రివిక్రమ్ ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ కమిట్మెంట్లు పూర్తయిన తర్వాత పవన్ కళ్యాణ్ నిర్మాణంలో చరణ్-త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చే సినిమాపై ఓ క్లారిటీ రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X