ఆంధ్రా తీరంలో పవన్ కళ్యాణ్ సినీ స్టూడియో!
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగానే కాకుండా....నిర్మాతగా తన సత్తా చాటాలని, న్యూ టాలెంట్‌ని ఎంకరేజ్ చేయాలనే ప్లాన్లో ఉన్న సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజన తర్వాత పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. ఈ నేపథ్యంలో చంద్ర బాబు గవర్నమెంటు సహాయంతో ఆంధ్రా తీరంలో సినీ స్టూడియో ప్లాన్ చేస్తున్నాడట పవన్ కళ్యాణ్.
అందరిలా వైజాగ్ ప్రాంతంలో కాకుండా......పవన్ కళ్యాణ్ దృష్టి గోదావరి జిల్లాల వైపు మళ్లింది. చాలా కాలంగా గోదావరి జిల్లాల్లో కూడా తెలుగు సినిమాల షూటింగులు జరుగుతున్నాయి. అయితే ఇక్కడ సినీ స్టూడియోల సౌకర్యం మాత్రం లేదు. నర్సాపురం, పాడిపాలెం సమీపంలోని సముద్రం తీరంలో సినీ స్టూడియో నిర్మిస్తే భవిష్యత్తులో తెలుగు సినీ పరిశ్రమకు అనుకూలంగా ఉంటుందని పవన్ కల్యాణ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

భవిష్యత్తులో పూర్తి స్థాయి నిర్మాతగా మారే ఆలోచన కూడా ఉంది కాబట్టి సినీ స్టూడియో ఉంటే మరింత అనుకూలంగా ఉంటుందని పవన్ కళ్యాన్ భావిస్తున్నారట. త్వరలో ఇందుకు సంబందించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి. పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికొస్తే...ప్రస్తుతం ఆయన ‘గోపాలా గోపాలా' చిత్రం చేస్తూ బిజీగా గడుపుతున్నారు. దీని తర్వాత ‘గబ్బర్ సింగ్ 2' చిత్రం చేయనున్నారు.
నేచురల్ గా కనబడే పవన్ కళ్యాణ్ డ్రెస్సింగ్ స్టైల్: క్లిక్ చేయండి


Click it and Unblock the Notifications