పెద్ద రిస్క్ చేస్తున్న పవన్ కల్యాణ్.. ప్రమాదమని తెలిసినా తప్పట్లేదు.!
సినీ ఇండస్ట్రీలో హీరోలు చాలా మందే ఉంటారు. కానీ, భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం తక్కువ మందికి ఉంటుంది. అలాంటి వారిలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకడు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినిమాల్లోకి వచ్చిన అతడు.. తనలోని ప్రత్యేకమైన టాలెంట్‌తో స్టార్ హీరోగా ఎదిగాడు. జయాపజయాలతో సంబంధం లేకుండా పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. రాజకీయాల కోసం గ్యాప్ తీసుకుని.. చాలా కాలం తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఆ వివరాలు మీకోసం.!

నాయకుడిగా వెళ్లి... లాయర్‌గా ఎంటర్
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ‘అజ్ఞాతవాసి' తర్వాత రాజకీయాల కోసం సినిమాలకు దూరం అయ్యాడు పవన్ కల్యాణ్. సుదీర్ఘ విరామం అనంతరం ‘వకీల్ సాబ్' అనే మూవీ ద్వారా ఆయన మరోసారి ముఖానికి మేకప్ వేసుకుంటున్నాడు. వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాత. బాలీవుడ్ మూవీ ‘పింక్'కు రీమేక్‌గా వస్తుందీ సినిమా.

ఒకటి అవకముందే... మరో రెండు ఫైనల్
‘వకీల్ సాబ్' సినిమా షూటింగ్ జరుగుతుండగానే... పవన్ కల్యాణ్ మరో రెండు ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపేశాడు. అందులో ఒకటి ఏఎమ్ రత్నం నిర్మాణంలో క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించే సినిమా కాగా, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రొడక్షన్‌లో హరీశ్ శంకర్ రూపొందించే మూవీ మరొకటి. ఈ రెండూ సినిమాలూ ఒకదాని తర్వాత మరొకటి పట్టాలెక్కనున్నాయి.

పవన్ కెరీర్‌లోనే ప్రతిష్టాత్మకం.. ప్రత్యేకం
ప్రస్తుతానికి పవన్ కల్యాణ్ సంతకం చేసిన మూడు సినిమాల్లో క్రిష్ తెరకెక్కించేది చాలా ప్రత్యేకమైనది అని చెప్పవచ్చు. దీనికి కారణం.. ఈ సినిమా పిరియాడిక్ జోనర్‌లో రూపొందుతుండడమే. పవర్ స్టార్ కెరీర్‌లో తొలిసారి అలాంటి సినిమా రాబోతుండడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ప్రతిష్టాత్మంగా రాబోతున్న ఈ సినిమాకు ‘విరూపాక్ష' అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

పవర్ స్టార్‌కు అలా రెండో సినిమా ఇది
ఈ సినిమాలో మొగలాయిల కాలం నాటి కథతో రూపొందుతోందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. అలాగే, ఇందులో పవన్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని కూడా వార్తలు వస్తున్నాయి. ‘తీన్‌మార్' తర్వాత డుయల్ రోల్ చేస్తున్న సినిమా ఇదేనని అంటున్నారు. మరోవైపు, ఈ మూవీకి హీరోయిన్ ఎంపిక ఇంకా జరగకపోవడం గమనార్హం.

పెద్ద రిస్క్ చేస్తున్న పవన్ కల్యాణ్
ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమా కోసం చిత్ర యూనిట్ సరికొత్త వ్యూహాలు సిద్ధం చేస్తుందనే టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో పవన్ కల్యాణ్ కూడా దీని కోసం సరికొత్త గెటప్స్‌తో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ఈ సినిమా కోసం పవర్ స్టార్ పెద్ద రిస్క్ చేస్తున్నాడని తాజాగా ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది.
Recommended Video

ప్రమాదమని తెలిసినా తప్పట్లేదు.!
తన కెరీర్‌లోనే తొలి పిరియాడిక్ మూవీ కావడంతో.. కత్తిసాము, గుర్రపు స్వారీలో పవన్ కల్యాణ్ శిక్షణ తీసుకుంటున్నాడని తెలిసింది. మరీ ముఖ్యంగా కోహినూర్ డైమండ్ ఎపిసోడ్ కోసం అతడు తుపాకీతో విన్యాసాలు చేయబోతున్నాడట. అలాగే, ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే కొన్ని సీన్స్ కోసం రియల్ స్టంట్స్ చేయడానికి రెడీ అయ్యాడని ఇండస్ట్రీ సర్కిళ్లలో ఓ వార్త వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











