మోడ్రన్ శ్రీ‌కృష్ణ పరమాత్ముడిగా... పవన్ కళ్యాణ్?

By Bojja Kumar

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో మోడ్రన్ శ్రీకృష్ణుడిగా తెలుగు ప్రేక్షకులను అలరించబోతున్నారా? అంటే అవుననే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి ఫిల్మ్ నగర్ నుంచి. హిందీలో మంచి విజయం సాధించిన అక్షయ్ కుమార్ మూవీ 'ఓ మై గాడ్' చిత్రం రీమేక్ చేయాలని పవర్ స్టార్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్.

పవన్ సన్నిహితుల నుంచి అందిన సమాచారం ప్రకారం....ఇటీవలే పవన్ కళ్యాణ్ 'ఓ మై గాడ్' చిత్రం చూసాడని, స్టోరీ చూసి బాగా ఇంప్రెస్ అయ్యాడని, ఆ చిత్రంలో అక్షయ్ కుమార్ మాదిరి లార్డ్ శ్రీకృష్ణ పాత్ర చేయడానికి పవన్ కళ్యాణ్ ఆసక్తి చూపుతున్నాడని, దర్శకుడు సంపత్ నందిని ఈచిత్రానికి దర్శకుడిగా పవన్ ఎంపిక చేసినట్లు సమాచారం.

కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందే ఈచిత్రంలో లవ్ స్టోరీ, ఫైట్స్ తక్కువగా ఉండటం, కథ ఆకట్టుకునే విధంగా ఉండటంతో అభిమానులకు కొత్త అనుభూతిని ఇవ్వడంతో పాటు, మెప్పిస్తుందని పవన్ కళ్యాణ్ భావిస్తున్నాడట. అయితే ఈచిత్రం విషయమై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు. త్వరలోనే ఈ మూవీపై క్లారిటీ రానుంది.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రాజెక్టులో నటించడానికి రెడీ అవుతున్నాడు. జల్సా లాంటి హిట్ చిత్రం తర్వాత మళ్లీ వీరి కాంబినేషణ్ కలవడంతో ఇటు అభిమానుల్లోనూ అటు ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక పవర్ స్టార్ నటించిన 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం ఇటీవల విడుదలైన మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X