పవన్ కళ్యాణ్ తన అత్తమామలు(రేణు దేశై తల్లితండ్రులు) వద్దకు వెళ్ళినట్లు సమాచారం. నిన్నటివరకూ ఎలక్షన్స్ అయిపోవటంతో రోడ్ షో లంటూ తిరిగిన ఆయన రెస్ట్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక్కడుంటే ఏదో ఒక ఏవిగేషన్ లో ఉంటామని రేణూనే పట్టుపట్టి తన ఇంటికి తీసుకెళ్ళిందని నవ్వుతూ చెప్పుకుంటున్నారు. ఇక అకిరా(పవన్ కుమారుడు) కూడా తన వేసవికి తన అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళినట్లు ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నారుని సమాచారం. అయితే ఆయన కొమురం పులి చిత్రం పూర్తి చేయటానికి షూటింగ్ కి అటెండ్ కావాల్సి ఉంది. దాంతో ఎక్కువ రోజులు ఉండరని అంటున్నారు. ఇక ఇప్పటికే చాలామంది నటులు,రాజకీయ నాయకులు చల్లదనం వెతుక్కుంటూ సిమ్లా, డార్జిలింగ్ వంటి ప్రదేశాలకు వెళ్థున్నారు. మరికొంతమంది అయితే ఏకంగా ఇతర దేశాలకు టూరిస్ట్ వీసాలపై వెళ్ళటానికి రెడీ అవుతున్నారు.