OG మూవీలో ముగ్గురు పవన్‌లు.. ఎలా కనిపిస్తారో తెలిస్తే మైండ్ బ్లాకే!
మామూలుగా టాలీవుడ్‌లోని స్టార్ హీరోలు ఒక సినిమా చేయడానికే చాలా ఏళ్లు సమయం తీసుకుంటున్నారు. అయితే, కొందరు మాత్రం ఒకేసారి మూడు, నాలుగు ప్రాజెక్టులను కూడా చేస్తున్నారు. అందులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకడు. ఈ మధ్య కాలంలో ఏకధాటిగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్న అతడు.. ఇప్పుడు చేతి నిండా చిత్రాలతో ఫుల్ బిజీగా గడుపుతోన్నాడు. అందులో 'OG' (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) ఒకటి. పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ మూవీ నుంచి తాజాగా క్రేజీ న్యూస్ లీకైంది. ఆ వివరాలు మీకోసమే!
గ్యాంగ్‌స్టర్‌గా మారిన పవన్
పవన్ కల్యాణ్ హీరోగా సుజిత్ రూపొందిస్తున్న చిత్రమే 'OG'. దీన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో ప్రియాక అరుల్ మోహన్ హీరోయిన్‌గా.. అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్, ఇమ్రాన్ హష్మీ, శ్రీయా రెడ్డి సహా ఎంతో మంది స్టార్లు కీలక పాత్రల్లో చేస్తున్నారు. ఎస్ థమన్ దీనికి సంగీతాన్ని అందిస్తున్నాడు.

ఆ స్టోరీతో.. అంచనాలతో
స్టార్ హీరో పవన్ కల్యాణ్ నటిస్తోన్న సినిమాల్లో 'OG' (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) ఒకటి. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ దీన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీని భారీ బడ్జెట్‌తో తీస్తున్నారు. యాక్షన్ జోనర్‌లో 1990 నాటి బ్యాగ్‌డ్రాప్‌తో రాబోతున్న ఈ చిత్రంపై ఆరంభంలోనే హైప్ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే ఈ మూవీని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.
షూటింగ్ స్పీడుగానే చేసి
హై ఓల్టేజ్ యాక్షన్‌తో రూపొందుతోన్న 'OG' మూవీకి సంబంధించిన షూటింగ్ గత ఏడాదిలోనే ప్రారంభం అయింది. అప్పటి నుంచి కొద్ది రోజుల వ్యవధిలోనే యాభై శాతం వరకూ టాకీ పార్ట్ పూర్తైంది. ఇక, ఇప్పుడు పవన్ డేట్స్ ఇవ్వని కారణంగా చిత్రీకరణ ఆగిపోయింది. త్వరలోనే మిగిలిన దాన్ని పూర్తి చేసి.. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 27న విడుదల చేయాలని చూస్తున్నారు.

ఏకంగా మూడు పాత్రల్లో
సుజిత్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ నటిస్తోన్న 'OG' మూవీ పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఇందులో పవర్ స్టార్ డుయల్ రోల్ చేస్తున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. కానీ, దీనిపై ఎలాంటి క్లారిటీ రాలేదు. ఈ పరిస్థితుల్లో 'OG' మూవీలో పవన్ కల్యాణ్ ఏకంగా మూడు విభిన్నమైన గెటప్‌లలో కనిపించబోతున్నాడని తాజాగా తెలిసింది.
ఎలా కనిపిస్తాడో తెలిస్తే
ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోన్న సమాచారం ప్రకారం.. 'OG' మూవీలో పవన్ కల్యాణ్ ఓ సాధారణ వ్యక్తి గ్యాంగ్‌స్టర్‌గా మారి.. ఆ తర్వాత రాజకీయ నాయకుడు అవడం చూపిస్తారట. ఇందులో యంగ్ ఏజ్‌లో ఒకలా, గ్యాంగ్‌స్టర్‌గా మారిన తర్వాత ఇంకోలా, పొలిటికల్ లీడర్‌గా మరోలా పవన్ కనిపిస్తాడని అంటున్నారు. ఇదే నిజమైతే ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పొచ్చు.

గెటప్‌లు లీక్ కాకుండా
ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు పూర్తైన వెంటనే పవన్ కల్యాణ్ 'OG' మూవీ షూట్‌లో పాల్గొంటాడని తెలిసింది. అప్పుడే మిగిలిన రెండు గెటప్‌లకు సంబంధించిన షూటింగ్ జరపబోతున్నారట. ఈ రెండూ సినిమాలో చూసినప్పుడు ఫ్రెష్‌గా ఉండడం కోసం వాటిని లీక్ కాకుండా చిత్ర యూనిట్ జాగ్రత్తలు తీసుకోబోతుందని అంటున్నారు.


Click it and Unblock the Notifications











