Prabhas - pawan kalyan ఫస్ట్ టైమ్ బ్రేక్ఫాస్ట్.. ఈ రియల్ సీన్‌తో ఫ్యాన్స్ కడుపు నిండిపోయింది!
స్టార్ హీరోలు చాలావరకు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అని బయట జనాలకు ఎక్కువగా తెలియదు. కొన్నిసార్లు స్టార్ ఇమేజ్ కారణంగా హీరోలు కూడా ఇతర హీరోల గురించి మాట్లాడడానికి సందేహిస్తారు. కానీ పర్సనల్ లైఫ్ లో మాత్రం వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అని బయటకు తెలియదు. అప్పుడప్పుడు ఏదైనా ఈవెంట్స్ లో కలిస్తే కూడా అగ్రహీరోలు పక్కపక్కనే కూర్చుని భోజనం చేస్తారు కూడా. ఇక రీసెంట్ గా ఒక బాలీవుడ్ అగ్రహీరో కోసం ప్రభాస్ పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా పక్క పక్కనే కూర్చుని బ్రేక్ ఫాస్ట్ చేశారట. అయితే ఈ నిజమైన సీన్ ఎలా జరిగింది ఎందుకు జరిగింది ఎక్కడ జరిగింది అనే వివరాల్లోకి వెళితే..

మెగా, రెబల్ బాండింగ్
మెగా ఫ్యామిలీ కి రెబల్ స్టార్ ఫ్యామిలీ కి చాలా మంచి సాన్నిహిత్యం ఉంది అని అందరికీ తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి కృష్ణంరాజు తరచుగా కలుసుకుంటూనే ఉంటారు. ప్రజారాజ్యం పార్టీలో కూడా ఆయన కొనసాగిన విషయం తెలిసిందే. రెబల్ స్టార్ ప్రభాస్ కూడా మెగా హీరోలతో చాలా ఫ్రెండ్లీ గానే ఉంటాడు.

హీరోలతో ఫ్రెండ్లిగా
అయితే రెబల్ స్టార్ ప్రభాస్ స్టార్ ఇమేజ్ ఎంత పెరిగినా కూడా ఇతర హీరోలతో చాలా ఫ్రెండ్లీ గా ఉంటాడు. ప్రభాస్ గోపీచంద్ మంచి స్నేహితులు. అలాగే రానా దగ్గుబాటి కూడా బాహుబలి లో అతనికి చాలా క్లోజ్ అయ్యాడు. అదే తరహాలో ఎన్టీఆర్ రామ్ చరణ్ తో కూడా ప్రభాస్ కు మంచి సాన్నిహిత్యం ఉంది అని ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంది.

మహేష్ బాబుతో కూడా
రీసెంట్ గా ప్రభాస్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తో కలిసి మాట్లాడేందుకు వెళ్లగా అక్కడ మహేష్ బాబు తో కూడా చాలా సరదా గా కనిపించాడు. మెగాస్టార్ చిరంజీవి తో ప్రత్యేక ఒక ఫ్లైట్లో వెళ్లిన విషయం తెలిసిందే. హీరోగా ఎంత బిజీగా ఉన్నా మిగతా హీరోలతో కలుసుకునే సందర్భం వస్తే మాత్రం ప్రభాస్ చాలా ఆసక్తి చూపిస్తాడు అని అర్థం చేసుకోవచ్చు.

పవన్ - ప్రభాస్ బ్రేక్ ఫాస్ట్
ప్రభాస్ తరహాలోనే పవన్ కళ్యాణ్ కూడా మిగతా హీరోలతో చాలా స్నేహంగా ఉంటాడు. గతంలో ఎన్టీఆర్ అరవింద సమేత లాంచ్ వేడుకల్లో కూడా పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే రీసెంట్ గా ప్రభాస్ కలిసిన పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా బ్రేక్ ఫాస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ అద్భుతమైన సన్నివేశం గురించి తెలుసుకున్న అభిమానుల కడుపు నిండిపోయింది అంటూ సోషల్ మీడియాలో కూడా కామెంట్స్ చేస్తున్నారు.

రామోజీ ఫిల్మ్ సిటీలో
ఇక ఆ బ్రేక్ ఫాస్ట్ ఎప్పుడు ఎలా జరిగింది అనే వివరాల్లోకి వెళితే. పవన్ కళ్యాణ్ రామోజీ ఫిలిం సిటిలో ఇటీవల భీమ్లా నాయక్ సినిమా షూటింగ్ ను పూర్తి చేసిన విషయం తెలిసిందే. అలాగే రెబల్ స్టార్ ప్రభాస్ కూడా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే ను అక్కడే చేస్తున్నాడు. ఆ సినిమా కోసమే అమితాబచ్చన్ ప్రత్యేకంగా ముంబై నుంచి వచ్చారు.

అమితాబ్ కోసం..
అమితాబచ్చన్ అంటే పవన్ కళ్యాణ్ కు ఒక ప్రత్యేకమైన గౌరవం అని అందరికీ తెలిసిందే. అయితే ఆయన వచ్చారని తెలుసుకుని పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్ K సెట్స్ లోకి వెళ్లి అబితాబ్ బచ్చన్ ను ప్రత్యేకంగా కలుసుకున్నారట. అంతేకాకుండా ప్రభాస్ ను కూడా ప్రత్యేకంగా కౌగిలించుకునే కాసేపు సరదాగా మాట్లాడుకున్నారని తెలుస్తోంది.
Recommended Video

ముగ్గురు హీరోలతో.. కనువిందు
పవన్ కళ్యాణ్ బ్రేక్ ఫాస్ట్ సమయంలో రావడంతో ప్రభాస్ కూడా ప్రత్యేకంగా అమితాబ్ బచ్చన్ తో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ముగ్గురు హీరోలు కూడా అలా సరదాగా మాట్లాడుకుంటూ బ్రేక్ ఫాస్ట్ చేయడంతో ప్రాజెక్ట్ K యూనిట్ సబ్యులకు కనువిందుగా అనిపించిదట. ఇక సోషల్ మీడియాలో న్యూస్ లీక్ అవ్వడంతో ఆ సీన్ గురించి తెలుసుకున్న ఫ్యాన్స్ కడుపు నిండిపోయింది అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











