పులి నిర్మాతకు పవన్ కళ్యాణ్ తాజాగా ప్రామిస్...
పులి నిర్మాత శింగనమల రమేష్ కు రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ఓ ప్రామిస్ చేసాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. వారు చెప్పుకునే దాని ప్రకారం..పులి ప్లాఫ్ అయినందుకు రమేష్ ని ఏమీ భాధపడవద్దని..తను ప్రీగా మరో చిత్రం చేస్తానని, దానికి ఏర్పాట్లు చేసుకోమని పవన్ కళ్యాణ్ ఆయనకు చెప్పారట. పులి పేరు చెప్పి పూర్తి స్ధాయిలో పెట్టుబడి పోవటంతో పవన్ ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. అయితే పులి డిస్ట్రి బ్యూటర్స్ కొందరు మాత్రం తమకు రికవరీ నిర్మాత చేయాలనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఇక తమిళనాడులో రజనీకాంత్ ఇలాంటి రికవరీలు చేస్తూంటారు. అలాగే తెలుగులో గతంలో కృష్ణ తనతో సినిమా తీసి ప్లాఫ్ అయిన నిర్మాతలకు ఫ్రీగా మరో చిత్రం చేసి ఆదుకునే వారు. ఇంతకుముందు ఎన్టీఆర్ కూడా ఆంధ్రావాలా తీసి దెబ్బతిన్న నిర్మాతకు నా అల్లుడు తీసి ఇచ్చారు. అలాగే జగడం నిర్మాతకు ఆ ప్లాప్ ని రికవరీ చేసేందుకు సుకుమార్ ఆర్య-2 ఇచ్చారు.


Click it and Unblock the Notifications











