తెలుగు దేశం భారీ స్ధాయిలో 'యువగర్జన' నిర్వహించి హిట్టవటంతో 'ప్రజారాజ్యం' కూడా అదే తరహాలో బహిరంగ సభను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. అయితే ఆ మీటింగ్ కోస్తా జిల్లాలవారి కోసం పెట్టాలని ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. ఇక ఆ సభకి పవన్ కళ్యాణ్ అటెండవతాడని తెలుస్తోంది. పులిగాండ్రింపు అనే పవర్ ఫుల్ టైటిల్ ని ఆ సభకు పవన్ పెట్టే అవకాశముందని ఫిల్మ్ సర్కిల్స్ లోనూ పార్టీ వర్గాల్లోనూ చెప్పుకుంటున్నారు. ఇక ఈ మీటింగ్ విజయవాడలో పెడతారని డిసెంబర్ నెలాఖరులో ఉండవచ్చని అంటున్నారు. అలాగే ఆ సమయానికి పవన్ పులి చిత్రం కూడా షూటింగ్ ఫినిష్ అవుతుంది కాబట్టి భారీ పబ్లిసిటీతో సినిమాకీ క్రేజ్ వస్తుంది అని వారంటున్నారు. ఇదే నిజమైతే ఒకే దెబ్బకు రెండు పిట్టలు పడతాయి కదా.