అల్లు అర్జున్ కోసం పవన్ కళ్యాణ్ 'పులి' వాయిదా
పవన్ కళ్యాణ్ కొమురం పులి రిలీజ్ డేట్ మళ్ళీ మారింది. ఈ చిత్రం మొదట అనుకున్నట్లుగా మే 14న రిలీజ్ కాకుండా జూన్ మొదటి వారానికి వాయిదా పడినట్లు విశ్వసనీయ సమాచారం. దానికి కారణం అల్లు అర్జున్ వేదం చిత్రం మే ఇరవై న రిలీజ్ ప్లాన్ చేయటమేనంటున్నారు. పులికి, వేదం కు మధ్య మినిమం మూడు వారాలు గ్యాప్ ఉండాలని భావించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మే మొదటి వారంలో సోనీ బియమ్ జి ద్వారా పులి ఆడియో రిలీజ్ కానుంది. ఇక ప్రముఖ ఫైనాన్సియర్ శింగనమల రమేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఎఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్నారు.
నిఖిషా పటేల్ హీరోయిన్ గా చేస్తున్న పులి చిత్రంలో మనోజ్ బాజపేయి నెగిటివ్ రోల్ చేస్తున్నారు. పోలీస్ డిపార్ట్ మెంట్ చుట్టూ తిరిగే ఈ కథలో నాజర్, చరణ్ రాజ్, గిరీష్ కర్నాడ్ కీలకపాత్రలు చేస్తున్నారు. వినోద్ ప్రధాన్ కెమెరా అందిస్తూంటే ఖుషీ ఫేమ్ ఎస్ జె సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే రీసెంట్ గా పవన్ హీరోగా జయంత్ పరాంన్జీ దర్శకత్వంలో లవ్ ఆజ్ కల్ చిత్రం రీమేక్ ప్రారంభమైంది. బొత్సా సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హాస్యనటుడు గణేష్ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.


Click it and Unblock the Notifications











