పవన్ 'పులి' నుంచి ఈ సీన్స్ తొలిగించారు
పవన్ కళ్యాణ్ తాజా చిత్రం పులి నుంచి కొన్ని సన్నివేశాలు తొలిగించి కొద్దిగా డ్యామేజ్ ని కంట్రోల్ చేద్దామనే నిర్ణయానికి నిర్మాతలు వచ్చారని సమాచారం. అందునిమిత్తం నిన్న(బుధవారం) నుంచి ఈ చిత్రంని రీ ఎడిట్ చేసి కొత్త వెర్షన్ ని ధియోటర్స్ లో స్క్రీన్ చేస్తున్నారు. ఇక ఈ ఎడిటింగ్ లో తొలిగించిన సన్నివేశాలు ఏవి అంటే...మొదటగా..పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ సన్నివేశంగా వచ్చే ఫైట్ సన్నివేశం నిడివి బాగా తగ్గించారు. రెండవది..పులి టీమ్ ఇన్విస్టిగేషన్ ప్రాసెస్ సీన్స్ లెంగ్త్ కూడా బాగా ఎడిట్ చేసారు. ఇక మూడవది కామిడీ ట్రాక్, రొమాంటిక్ సన్నివేశాల్లో పవన్ గొంతు మార్చే సీన్ ,నిఖిషా పటేల్ తో ఉన్నది పూర్తిగా తీసేస్తున్నారు. చివరగా క్లైమాక్స్ ఫైట్ లో మంటల్లో పవన్ కనపడే సీన్స్ ని లెంగ్త్ బాగా తగ్గిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ కట్స్ తో సరిపెడుతున్నారు. అప్పటికీ మార్పు కనపడకపోతే మరికొన్ని సన్నివేశాలు తొలిగించాలని నిర్ణయించారు. అయితే రిలీజైన దాదాపు వారం తర్వాత చేస్తున్న ఈ ఎడిటింగ్ సినిమాకు ఎంతవరకూ బెనిఫెట్ అనేది అందరూ ఎదురుచూస్తున్న అంశం. ఎందుకంటే ఇప్పటికే ఫ్లాప్ టాక్ విపరీతంగ్ స్ప్రెడ్ అయి ధియోటర్ వైపుకి తొంగిచూడటానికి అభిమానులు సైతం భయపడుతున్నారనేది నిజం.


Click it and Unblock the Notifications











