ఆ విషయంలో అన్నయ్యకు షరత్తులు పెట్టిన పవన్ కళ్యాణ్..!?
గబ్బర్ సింగ్ సినిమాకి పవన్ కళ్యాణ్ నిర్మాత అని ప్రకటనలు వచ్చినా కానీ నిజానికి ఈ చిత్రాన్ని పవన్ నర్మించడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నాగబాబు నిర్మించాల్సిన ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ కావాలని తన పేరు మీద నిర్మిస్తున్నట్టు భోగట్టా. 'ఆరెంజ్" సినిమాకి బయ్యర్లు నిండా మునిగిపోవడంతో ఇప్పుడు ఇమ్మీడియట్ గా నాగబాబు మరో చిత్రం నిర్మిస్తే వాళ్లంతా అతనిపై పడే అవకాశముంది.
అందుకే బినామీగా పవన్ ని పెట్టి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడని తెలిసింది. అయితే ఈ చిత్రానికి పవన్ కళ్యాణ్ పారితోషికం తీసుకోవట్లేదని, బిజినెస్ లో వాటా అడిగాడని సమాచారం. నిర్మాణ వ్యవహారాలన్నీ తన చేతల్లోనే ఉంటాయని అన్నయ్యకి షరత్తు పెట్టాడని, తనతో లవ్లీ సినిమా నిర్మించిన గణేష్ కి నిర్మాణ వ్యవహారాలు పర్యవేక్షించే బాధ్యత అప్పగించాడని విశ్వసనీయంగా తెలిసింది. అదన్నమాట గబ్బర్ సింగ్ కథ. ఈ సినిమాకి టైటిల్ ఎంత వరకు సరిపోతుందో కానీ వీళ్లు వేస్తున్న ప్లాన్ కి మాత్రం ఇది యాప్ట్ టైటిల్ అని అంటున్నారు.


Click it and Unblock the Notifications











