పవన్ కళ్యాణ్ ఆ డబ్బు ఎలా సెటిల్ చేస్తాడంటూ చర్చ!
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు జనసేన పార్టీ స్థాపించడానికి ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఇందుకుగాను హైదరాబాద్, విశాఖపట్నంలో భారీ సభలు నిర్వహించారు. ఈ సభల నిర్వహణ ఖర్చు ప్రముఖ నిర్మాత, వ్యాపారవేత ప్రసాద్ వి పొట్లూరి భరించారనే ప్రచారం సాగింది.
పవన్ కళ్యాణ్ మద్దతు ప్రకటించిన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రసాద్ వి పొట్లూరి ఆ పార్టీ నుండి ఎంపీ టికెట్ ఆశించారని, పవన్ కళ్యాణ్ ఆయనకు టికెట్ ఇప్పించడానికి ప్రయత్నించి విఫలమయ్యారనే ప్రచారం ఆ మధ్య మీడియాలో జరిగింది.

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ సభల కోసం ప్రసాద్ వి పొట్లూరి భారీగానే ఖర్చు పెట్టారు. అందుకు ప్రతి ఫలంగా పవన్ కళ్యాణ్ నుండి ఆయన ఏమీ పొందలేదు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ దీన్ని సెటిల్మెంట్ చేస్తారనే చర్చ మొదలైంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేసేది ఏమీ లేదు.....ఆయనకు ఓ సినిమా చేసి పెట్టడం తప్ప అని అంటున్నారు ఫిల్మ్ నగర్ జనాలు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘గోపాలా గోపాలా' చిత్రం చేస్తున్నారు. దీని తర్వాత ‘గబ్బర్ సింగ్-2' సినిమా చేయబోతున్నారు. గబ్బర్ సింగ్ -2 తర్వాత పవన్ కళ్యాణ్ పి.వి.పి కోసం సినిమా చేస్తారా? లేక గబ్బర్ సింగ్-2 కంటే ముందే చేస్తారా? అనేది ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ అయింది.


Click it and Unblock the Notifications











