పవన్-రాజమౌళి సినిమా కోసం నిర్మాత పోటీ?

By Bojja Kumar

తనతో ఓ సినిమా చేయండి ప్లీజ్ అంటూ ఎవరీనీ అడుక్కునే అలవాటు లేని పవన్ కళ్యాణ్ 'పంజా" ఆడియో సాక్షిగా ప్రముఖ దర్శకుడు రాజమౌళితో సినిమా చేయాలని ఉందటూ తొలిసారిగా చేయిచాచి అడిగిన విషయం తెలిసిందే. స్వయంగా పవన్ లాంటి ఓ పెద్ద స్టార్ నోరు తెరిచి అడిగిన నేపథ్యంలో...రాజమౌళి నుంచి తప్పుకండా పాజిటివ్ స్పందన వస్తుందని ఆవిస్తున్న పలువురు టాలీవుడ్ నిర్మాతలు...ఎలాగైనా ఆ ప్రాజెక్టును దక్కించుకునేందుకు ట్రై చేస్తున్నారు.

సాధారణంగా రాజమౌళి సినిమా అంటేనే కమర్షియల్ హిట్లకు మారుపేరు. ఎలాంటి సినిమా అయినా వసూళ్ల వరదే వరద ఖాయం. ఇక పవన్ కళ్యాన్ సినిమా గురించి, ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పేదేముంది?. మరి ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా అంటే ఆ సినిమా సంచలనాలు సృష్టించడం ఖాయం. అందుకే ఈ సినిమాను నిర్మించే అవకాశం దక్కించుకుంటే బోలెడు లాభాలు సాధించ వచ్చని అనేక మంది నిర్మాతలు భావిస్తున్నారు. ఇందు కోసం అటు రాజమౌళి సన్నిహిత వర్గాలను, ఇటు పవన్ కళ్యాన్ సన్నిహిత వర్గాలతో చర్చలు జరుపుతున్నారు. మరి పవన్-రాజమౌళి సినిమా ఎప్పుడు వస్తుందో? ఎవరి ప్రయత్నం ఫలిస్తుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X