»   » అల్లు అరవింద్ కి చెక్ పెట్టిన పవన్ కళ్యాణ్, రామ్ చరణ్....

అల్లు అరవింద్ కి చెక్ పెట్టిన పవన్ కళ్యాణ్, రామ్ చరణ్....

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇన్నాళ్లు తను చెప్పినట్టుగా ఆడడంతో చిరంజీవి పేరు చెప్పుకుని ఎన్నో సినిమాలు తీసి కోట్లు గడించిన అల్లు అరవింద్ కి ఇక మెగా హీరోలని కూడా తాడుకి కట్టి ఆడించడం కుదరదని తేలిపోయింది. ఇకపై గీతా ఆర్ట్స్ కి మెగా హీరోల డేట్లు దొరకడం కూడా కష్టమైన పనే అని అర్థమవుతోంది. రామ్ చరణ్ తన తల్లి పేరు మీద సొంత బ్యానర్ మొదలు పెట్టిన కొద్ది రోజులకే పవన్ కళ్యాణ్ కూడా సొంత కుంపటి పెట్టేసుకున్నాడు.

అమాయకుడైన నాగబాబుకి తన సొంత అన్నదమ్ముల డేట్లే దొరక్కుండా అడ్డుపడిన అల్లు అరవింద్ కి ఒకేసారి చరణ్ పవన్ చెక్ పెట్టారు. అల్లు అరవింద్ కి ఉన్న సత్సంబందాల వల్ల ఇతర హీరోలు అతని బ్యానర్ లో నటించడం దాదాపు అసాధ్యమే అనుకోవచ్చు. ఇక అల్లు అరవింద్ తన కొడుకు బన్నీతో చేసుకుంటూ, ఎప్పుడైనా కనికరిస్తే చరణ్, పవన్ లతో సినిమాలు చేసుకోవాల్సిందేనేమో..

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu