twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ రీ ఎంట్రీ.. వెండితెర జనసేనాని కాబోతున్నారా? లోలోపల జరుగుతున్న పరిణామాలేంటి?

    |

    Recommended Video

    Do You Think Pawan Kalyan Will Step Into Movies Again? || పవన్ నుంచి సినిమా కావాలా? వద్దా?

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ జర్నీ గురించి చెప్పాల్సిన పనే లేదు. చిన్నా- పెద్దా, క్లాస్- మాస్ అనే తేడాలేకుండా ప్రతీ ఒక్కరూ పవన్ సినిమాలను ఆదరించినవారే. సినీ కెరీర్ ప్రారంభించిన తొలినాళ్లలోనే తన పవర్ ఇదీ అని నిరూపిస్తూ వెండితెరపై ఓ వెలుగు వెలిగిన పవన్.. 25 సినిమాలు చేసి రాజకీయ బాట పట్టారు. జనసేనానిగా ప్రజల చెంతకు చేరారు. జనసేన పార్టీ కార్యక్రమాలను చురుకుగాముందుకు తీసుకెళ్తున్నారు. సరిగ్గా ఈ తరుణంలో పవన్‌కి సంబంధించిన కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వివరాలు చూద్దామా..

    దుమారం రేపిన పూనమ్ కౌర్..! ఫైర్ అవుతున్న పవన్ ఫ్యాన్స్.. ఇంతకీ ఆ మెసేజ్ అర్థమేంటి?దుమారం రేపిన పూనమ్ కౌర్..! ఫైర్ అవుతున్న పవన్ ఫ్యాన్స్.. ఇంతకీ ఆ మెసేజ్ అర్థమేంటి?

    కొంతకాలంగా ఎన్నో వార్తలు.. పవన్ స్పందన

    కొంతకాలంగా ఎన్నో వార్తలు.. పవన్ స్పందన

    పవన్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడంటూ పదే పదే వార్తలు వస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ అంశంపై గత కొంతకాలంగా ఎన్నో వార్తలు చూసాం. అయితే ఈ విషయమై పవన్ నుంచి ఎలాంటి స్పందన రానప్పటికీ.. ఆ డైరెక్టర్‌తో సినిమా, ఈ ప్రొడ్యూసర్‌తో లెక్కలు అంటూ రకరకాల వార్తలు పుట్టుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో న్యూస్ హల్చల్ చేస్తోంది.

    ఊపందుకున్న ప్రచారం.. ముదిరిన టాక్

    ఊపందుకున్న ప్రచారం.. ముదిరిన టాక్

    రాజకీయ బాట పట్టేటపుడే పూర్తి సమయాన్ని పాలిటిక్స్‌కే కేటాయిస్తానని చెప్పిన పవన్.. అన్నట్లుగానే చేస్తున్నారు. ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైనా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ముందుకెళ్తున్నారు. కానీ ఎన్నికల ఫలితాల తర్వాత పవన్.. తన నిర్ణయాన్ని మార్చుకున్నారంటూ ప్రచారం ఊపందుకుంది. గతంలో కొంతమంది నిర్మాతల నుంచి అడ్వాన్సులు తీసుకున్న ఆయన, ఇప్పుడు ఆ ప్రాజెక్టులను చేసే ఆలోచనలో పడ్డారనే టాక్ ముదిరింది.

    2006 సంవత్సరంలో 'సత్యాగ్రహి'

    2006 సంవత్సరంలో 'సత్యాగ్రహి'

    సరిగ్గా ఈ తరుణంలో 'సత్యాగ్రహి' సినిమా టాపిక్ మళ్లీ తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ హీరోగా సూర్య మూవీస్ బ్యానర్‌పై 2006 సంవత్సరంలో 'సత్యాగ్రహి' సినిమాను సెట్స్ మీదకు తీసుకొచ్చారు. కొద్దిరోజుల పాటు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా అర్దాంతరంగా ఆగిపోయింది.

    పవన్ ఆలోచనలో పడ్డారా..?

    పవన్ ఆలోచనలో పడ్డారా..?

    సామాజిక సమస్యలపై పోరాడే యువకుడి కథ ఆధారంగా ఈ సినిమా స్క్రిప్ట్ రాశారు మేకర్స్. అప్పట్లో ఈ స్క్రిప్ట్ పవన్‌కి బాగా నచ్చడంతో ఓకే చెప్పేశారు. కానీ అనుకోని కారణాల వల్ల ఆ సినిమా షూటింగ్ జరగలేదు. సో.. ఇప్పుడు పవన్ ఆ సినిమా పూర్తి చేయాలనే ఆలోచనలో పడ్డారనే వార్తలు తెగ షికారు చేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో తన రాజకీయ జీవితానికి కూడా ఈ కథ ప్లస్ అవుతుందని ఆయన భావిస్తున్నట్లుగా చెప్పుకుంటున్నారు.

     క్రిష్ దర్శకత్వంలో సినిమా.. అడ్వాన్ సంగతి

    క్రిష్ దర్శకత్వంలో సినిమా.. అడ్వాన్ సంగతి

    క్రిష్ దర్శకత్వంలో ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించే దిశగా పవన్ అడుగులేస్తున్నారని తెలుస్తోంది. అప్పట్లో ఎ.ఎమ్.రత్నం ఇచ్చిన అడ్వాన్స్ పవన్ దగ్గరే ఉండటం వలన, ఆయన నిర్మాణంలోనే ఈ సినిమా తెరకెక్కనుందని అంటున్నారు.

     పవన్ పొలిటికల్ జర్నీ.. జనం టాక్

    పవన్ పొలిటికల్ జర్నీ.. జనం టాక్

    పేరుకుపోయిన అవినీతిని రూపుమాపడానికి తనకు అవకాశమివ్వండంటూ మొత్తుకున్నా కూడా జనం చూపు పవన్‌పై పడలేదు. దీంతో ఎన్నికల్లో జనసేన పార్టీ అట్టర్ ప్లాప్ అయింది. కాబట్టి 'సత్యాగ్రహి' లాంటి సమాజ నేపథ్యమున్న సినిమా చేస్తే, అది పవన్ రాజకీయ జీవితానికి ఎంతో కొంత హెల్ప్ అవుతుందని అంటున్నారు కొందరు. చూద్దాం.. చివరకు ఏం జరుగుతుందో!.

    English summary
    Pawan Kalyan's re entry into the movies is alomost confirm as per latest news. He will act in Krish (Radha Krishna Jagarlamudi) Direction.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X