పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ.. ఆ కొన్నిరోజులే కాల్షీట్స్.. షాకింగ్ రెమ్మునరేషన్!

ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. 'అజ్ఞాతవాసి' సినిమా తర్వాత రాజకీయ బాట పట్టిన పవన్ కళ్యాణ్.. తిరిగి వెండితెరపై కాలు మోపనున్నారని, 'పింక్' రీమేక్ ద్వారా పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఖాయం అయ్యిందని తెలిసింది. దీంతో ఈ వార్త మెగా అభిమానుల్లో సంబరాలు నింపింది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరికొన్ని ఆసక్తికర విషయాలు బయకొచ్చాయి.

బోనీ కపూర్, దిల్ రాజు.. నో అఫీషియల్‌ స్టేట్‌మెంట్

బోనీ కపూర్, దిల్ రాజు.. నో అఫీషియల్‌ స్టేట్‌మెంట్

ఇప్పటికే హిందీలో సూపర్ హిట్ సాధించిన ‘పింక్' సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి ఓకే చెప్పాడు పవన్. బోనీ కపూర్, దిల్ రాజు కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నారు. ఎంసీఏ ఫేమ్ శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించనున్నాడు. అయితే ఈ సినిమా ఎప్పుడు మొదలు కానుంది? ఇతర ముఖ్య వివరాలు మాత్రం అఫీషియల్‌గా బయటకు రాలేదు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ హ్యాండ్

త్రివిక్రమ్ శ్రీనివాస్ హ్యాండ్

ఈ ప్రాజెక్టులో త్రివిక్రమ్ శ్రీనివాస్ హ్యాండ్ కీలకం కానుందనేది తాజా సమాచారం. పవన్ కళ్యాణ్‌, త్రివిక్రమ్ మధ్య ఉన్న బాండింగ్ కారణంగా పవర్ స్టార్ రీ ఎంట్రీ కోసం భారీ డైలాగులు రాస్తున్నారట మాటల మాంత్రికుడు. ఇప్పటికే కొంత మేర డైలాగ్ వెర్షన్ ఆయన పూర్తి చేసినట్లు సమాచారం. త్వరలోనే ఈ విషయమై అఫీషియల్ ప్రకటన కూడా రానుందని తెలుస్తోంది.

అదే సరైన టైమ్.. పవన్ ఏర్పాట్లు

అదే సరైన టైమ్.. పవన్ ఏర్పాట్లు

మరోవైపు పవన్ తన రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. మరికొద్ది రోజుల్లో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలున్నాయి. సో.. ఆ టైమ్‌లో రాజకీయాల పరంగా పవన్‌కి కాస్త సమయం దొరికే ఛాన్స్ ఉంది కాబట్టి ఇదే సమయంలో పింక్ రీమేక్ ఫినిష్ చేయాలని భావిస్తున్నారట పవన్ కళ్యాణ్. ఈ మేరకు చకచకా అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారని తెలుస్తోంది.

షాకింగ్ రెమ్మునరేషన్.. మరీ ఇంతేనా?

షాకింగ్ రెమ్మునరేషన్.. మరీ ఇంతేనా?

ఇక ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ తీసుకోబోతున్న రెమ్మునరేషన్ ఏకంగా 50 కోట్లు అని వార్తలు వస్తున్నాయి. దీంతో సినీ వర్గాలు షాకవుతున్నాయి. మెగా అభిమానులు మాత్రం పవన్ రీ ఎంట్రీ అన్నాక ఆ రేంజ్ ఉండాల్సిందే అంటున్నారు. ఇంకోవైపు ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ కేవలం 20 రోజుల కాల్షీట్స్ మాత్రమే కేటాయించినట్లు టాక్ నడుస్తోంది.

Recommended Video

Cine Box : RRR Updates,Rajamouli Fully Focused On NTR And Ram Charan For RRR !
పవన్‌తో యంగ్ హీరోయిన్ రొమాన్స్

పవన్‌తో యంగ్ హీరోయిన్ రొమాన్స్

ఇక ఈ సినిమాలో హీరోయిన్ కూడా ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించనుందని టాక్. ప్రస్తుతం వరుస సినిమాలతో సూపర్ ఫామ్‌లో ఉన్న పూజా హెగ్డేను పవన్ సరసన తీసుకోవాలని నిర్మాత బోనీ కపూర్ ప్లాన్ చేశారని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X