ఇంట్రెస్టింగ్ అప్‌డేట్: పవన్ కొత్త సినిమా ప్రకటన ఆరోజే.. బయటకొచ్చిన దర్శక నిర్మాతల పేర్లు.!

మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ రంగ ప్రవేశం చేసినప్పటికీ, తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌. టాలీవుడ్‌లోని మిగిలిన హీరోలతో పోలిస్తే ఈయన స్టైల్ ప్రత్యేకంగా ఉంటుంది. అందుకే తెలుగు సినీ ఇండస్ట్రీలో పవన్ కల్యాణ్‌కు ఉన్న అభిమానులు మరే హీరోకూ ఉండరన్న అభిప్రాయం ఉంది. అయితే, కొన్నేళ్ల కిందట పవన్ రాజకీయాల్లోకి వెళ్లడంతో సినిమాలకు దూరమైపోయారు. దీంతో ఆయన అభిమానులు నిరాశకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది.

సంబరాలు మొదలయ్యాయి

సంబరాలు మొదలయ్యాయి

సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ 48వ పడిలోకి అడుగు పెడుతున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో ఉన్న పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన పుట్టినరోజు సంబరాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులన్నీ మొదలయ్యాయి. ఇక, సమయం దగ్గర పడడంతో సోషల్ మీడియా వేదికగా జనసైనికులు.. మెగా అభిమానులు తన ఆనందాన్ని పంచుకుంటున్నారు.

రామ్ చరణ్ పెంచేశాడు

రామ్ చరణ్ పెంచేశాడు

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును ఎంతో ఘనంగా చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక, పవన్ పుట్టినరోజును కూడా అదే స్థాయిలో నిర్వహించడానికి ఫ్యాన్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. వీరిని మరింత ఉత్సాహ పరచడానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల కామన్ డీపీని విడుదల చేసిన సంగతి విధితమే.

పవన్ నిర్ణయం మార్చుకున్నారట

పవన్ నిర్ణయం మార్చుకున్నారట

పవన్ త్వరలోనే మరోసారి సినీ రంగంలోకి రాబోతున్నారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. వాస్తవానికి ఎన్నికల ముందే పవన్ గతంలో కమిట్‌మెంట్ ఇచ్చిన నిర్మాతల కోసం సినిమాలు చేయబోతున్నాడని వార్తలు వచ్చాయి. కానీ, అది జరగలేదు. పైగా ఇటీవల తాను రాజకీయాల్లోనే ఉంటాను అని కరాకండిగా చెప్పుకొచ్చారాయన. ఇలాంటి సమయంలో పవన్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఆరోజే ప్రకటన అంటున్నారు

ఆరోజే ప్రకటన అంటున్నారు

ఇక, సెప్టెంబర్ 2న ఏర్పాటు చేయబోయే కార్యక్రమంలో పవన్ నటించబోయే సినిమాకు సంబంధించిన ప్రకటన చేస్తారని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ, చాలా మంది ఫ్యాన్స్ ఈ వార్త తెలిసిన వెంటనే ఖుషీ అయిపోతున్నారు. దీంతో పవన్ కొత్త సినిమా అంశం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది. అందరూ దీని గురించే చర్చలు జరుపుతున్నారు.

దర్శక నిర్మాతల పేర్లు కూడా బయటకు

దర్శక నిర్మాతల పేర్లు కూడా బయటకు

పవన్ సినిమా చేస్తున్నారన్న వార్త బయటకు రావడంతో పాటు ఆ సినిమాను తెరకెక్కించబోయే దర్శక నిర్మాతల పేర్లు కూడా ప్రచారం జరుగుతున్నాయి. దీని ప్రకారం.. ఈ సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో కే రాధాకృష్ణ నిర్మిస్తారట. ప్రస్తుతం వీరు అల్లు అర్జున్‌తో ‘అల.. వైకుంఠపురములో' అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే పవన్‌తో సినిమా మొదలవుతుందని ఫిలింనగర్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X