RGV పవర్‌స్టార్‌పై పవన్ కల్యాణ్ రియాక్షన్.. పోస్టర్స్ చూసి ఏం చేశారంటే
RGV పవర్‌స్టార్‌పై పవన్ కల్యాణ్ రియాక్షన్.. పోస్టర్స్ చూసి ఏం చేశారంటే
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చారో అప్పటి నుంచే ఆయనపై విమర్శలు ఘాటు ఎక్కువైందనే చెప్పాలి. ఇక విమర్శలు ఎన్ని వస్తున్నా కూడా పవన్ కళ్యాణ్ వాటి గురించి పట్టించుకోలేదు. ఇక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా పవన్ పై ఉహీంచని సినిమాలను తెరకెక్కిస్తు కొత్త కాంట్రవర్సీలకు దారి తీస్తున్నాడు. ఇక డైలీ పోస్టర్స్ రిలీజ్ చేస్తుండగా ఇటీవల పవన్ కళ్యాణ్ వాటిపై ఒక లుక్కేసినట్లు తెలుస్తోంది.

పవర్ స్టార్ సినిమాతో..
మొన్నటివరకు కాస్త హాట్ మసాలా సినిమాలతో హడావుడి చేసిన వర్మ ఇప్పుడు పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లో పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఎప్పుడు లేని విదంగా పవర్ స్టార్ ఎన్నికల తరువాత ఏ విధంగా ఉన్నాడనే కాన్సెప్ట్ తో సినిమాను తెరకెక్కిస్తున్నాడు. త్వరలోనే ఆ సినిమా ఆర్జీవి వరల్డ్ లో రిలీజ్ చేయబోతున్నారు.

రోజుకో పోస్టర్ రిలీజ్ చేస్తూ
అయితే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వర్మ రోజుకో పోస్టర్ రిలీజ్ చేస్తూ మరింత కాంట్రవర్సీని క్రియేట్ చేస్తున్నాడు. పోస్టర్స్ వైరల్ కావడంతో మొత్తానికి అవి పవన్ కళ్యాణ్ కంట పడినట్లు తెలుస్తోంది. ఆర్జీవి గతంలోనే అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అనే సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్రను క్రియేట్ చేసి ఉహీంచని హైప్ క్రియేట్ చేశాడు. కానీ అది పవన్ దృష్టిని ఆకర్షించలేదు.

సైలెంట్ గా నవ్వుకొని..
ఇక ఇప్పుడు పవర్ స్టార్ సినిమా పోస్టర్స్ ను చూసిన పవన్ కళ్యాణ్ ఏ మాత్రం సీరియస్ కాకుండా నవ్వుకున్నారట. RGV ట్వీట్స్ చేస్తున్న విధానంపై ఒక నిమిషం పాటు లుక్కేసిన పవన్ కళ్యాణ్ సైలెంట్ గా నవ్వుకొని లైట్ తీసుకున్నారట. ఆ విషయం గురించి ఆలోచిస్తే సమయం వృధా చేసుకోవడమే అవుతుందని, అందుకే ఏ మాత్రం స్పందించలేదని పవన్ సన్నిహితులు చెబుతున్నట్లు టాక్ వస్తోంది.
Recommended Video

ఆర్జీవీపై పవన్ కళ్యాణ్ కామెంట్స్
కావాలని టార్గెట్ చేసి విమర్శలు చేసే వారిపై ఇంతవరకు పవన్ కళ్యాణ్ పెద్దగా సీరియస్ అయ్యింది లేదు. గతంలో మీడియా సమావేశంలో ఆర్జీవి ప్రస్తావన రాగా పెళ్లి చేసుకున్న కూతురు ఉన్నా కూడా ఇంకా శృంగార వీడియోలు షేర్ చేసుకునే అలాంటి పెద్ద మనిషి గురించి మాట్లాడడం తనకు ఇష్టం లేదని మరోసారి అతని గురించి నేను ఏ మాత్రం స్పందించలేనని పవన్ మీడియాకు తెలియజేశారు. దీంతో అప్పటి నుంచి RGV ఎన్ని వివాదస్పద కామెంట్స్ చేసినా కూడా పవన్ ఏ మాత్రం స్పంధించడం లేదు.


Click it and Unblock the Notifications











