వావ్.. పవన్, ప్ర‌భాస్‌కి అలా మ్యాచ్ అయ్యింది, ఫ్యాన్స్ కి పండగే!

ఇతర ఇండస్ట్రీలో సినిమాలపై కరోనా ఎంత ప్రభావం చూపిందో తెలియదు గాని టాలీవుడ్ లో మాత్రం ఒక విధంగా ఇప్పుడు అభిమానులకు మంచి కిక్ లభిస్తోంది. ఎందుకంటే స్టార్ హీరోలు ఒక సినిమా అయిపోతే గాని మరొక సినిమా గురించి ఆలోచించని ఈ రోజుల్లో ఒకేసారి వివిధ రకాల కథలను ఒప్పుకునే ఛాన్స్ వచ్చింది. కరోనా లాక్ డౌన్ పుణ్యమా అంటూ ఎంతగానో ఆలోచించి కొత్త తరహా కథలను సెలెక్ట్ చేసుకుంటున్నారు.

ఒక విషయంలో ప్రభాస్, పవన్ కళ్యాణ్ కి మ్యాచ్ అయ్యిందనే చెప్పాలి. ఈ ఇద్దరు స్టార్ హీరోలు యాదృచ్చికంగా ఒకేసారి నాలుగు సినిమాలను లైన్ లొ పెట్టారు. ఒక వైపు ప్రభాస్ రాధే శ్యామ్ తో బిజీగా ఉంటే మరోవైపు పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ని రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారు. ఇక ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నెక్స్ట్ సినిమా చేస్తుండగా పవన్ క్రిష్ తో కలవనున్నారు. పవర్ స్టార్ హరీష్ శంకర్ సినిమాతో పాటు సురేందర్ రెడ్డి సినిమాను కూడా ఆల్ మోస్ట్ ఫిక్స్ చేసుకున్నాడు.

Pawan kalyan rebel star prabhas same lineup with four projects

ఇక రెబల్ స్టార్ ప్రభాస్ నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ తరువాత ఓం రావత్ దర్శకత్వంలో ఆది పురుష్ సినిమాను చేయనున్నాడు. అలాగే KGF దర్శకుడు ప్రశాంత్ నీల్ తో మరో సినిమా చేయనున్నాడు. ఈ విధంగా పవన్ కళ్యాణ్, ప్రభాస్ ఒకేసారి నాలుగు సినిమాలను చేతుల్లో ఉంచుకొని అభిమానుల్లో పవర్ఫుల్ జోష్ నింపుతున్నారు. మరి ఆ సినిమాలతో ఈ స్టార్స్ ఎంతవరకు సక్సెస్ అందుకుంటారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X