రామ్ చరణ్ ని రికమెండ్ చేసిన పవన్ కళ్యాణ్...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి మేజర్ బ్రేక్ ఇచ్చిన 'తొలిప్రేమ" దర్శకడు కరుణాకరన్ అంటే మెగా ఫ్యామిలీకి ఒక మంచి అభిప్రాయం ఉంది. ఎందు కంటే ఈయన ప్రేమ కథలు తప్ప వేరే కథల జోలికి వెళ్లనే వెళ్లడు కాబట్టి. కుర్ర వయసులో ఉన్న హీరోలందరూ ఈయనతో సినిమాలు తీయాలని ఉబలాటపడటం కామనే అయినా ఈయనకు మాత్రం పవర్ స్టారంటే చచ్చేంత పిచ్చి. అందుకే బాలుతో బాదేసిన దానికి పశ్చాతాపంగా మరో కొత్తరకం ప్రేమ కథతో సినిమా తీయాలని పవన్ కళ్యాణ్ ని అప్రోచ్ అయ్యాడు.
వచ్చే సంవత్సరం చివరి దాకా పవర్ స్టార్ డేట్స్ ఖాళీ లేకపోవటంతో రామ్ చరణ్ ని రికమెండ్ చేయడం, కథ వినడమూ జరిగిపోయాయంట. అంతే కాదు ఈ సినిమాకి ఎదురు లేదు"అనే టైటిల్ ను అనుకుంటున్నట్టుగా సమాచారం. ఇంకా ఈ సినిమాకి రామ్ చరణ్ సరసన తమన్నాని సెలక్ట్ చేసినట్టు సమాచారం. అన్ని అనుకూలిస్తే 'ఎదురు లేదు" సినిమా సెట్స్ మీదికి వెళ్ళనుందని సమాచారం. కాగా 'ఆరెంజ్" తో వెనుకబడ్డ రామ్ చరణ్ కు ఇది మరో తొలిప్రేమ అవుతుందంటూ అప్పుడే గుసగుసలు మొదలయ్యాయి.


Click it and Unblock the Notifications











