త్రివిక్రమ్ కథ చెప్పినా పవన్ కళ్యాణ్ ఒప్పుకోలేదట.. ఎందుకంటే?

సినిమా ఇండస్ట్రీలో ఎంత భారీ బడ్జెట్ సినిమా తీసినా కూడా హిట్ కాంబినేషన్స్ కి వచ్చిన హైప్ మరేసినిమాలకు రాదనే చెప్పాలి. స్టార్ హీరోతో ఒక దర్శకుడు సక్సెస్ అందుకున్నాడు అంటే వారి కాంబినేషన్ లో వచ్చే రెండవ సినిమాకే అంచనాల డోస్ అకాశాన్ని కూడా దాటేస్తాయి. అదే తరహాలో తెలుగులో పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ పై ఒక రేంజ్ లో మార్కెట్ ఏర్పడింది. అయితే ఇటీవల త్రివిక్రమ్ ఒక కథ చెప్పినప్పటికి పవన్ ఒప్పుకోలేదట.

 జల్సా ఫ్రెండ్స్..

జల్సా ఫ్రెండ్స్..

మొదటి సినిమా జల్సాతో మొదలైన వీరి ప్రయాణం ఆ తరువాత స్నేహంగా మారింది. కేవలం సినిమాలకు సంబంధించిన విషయాలే కాకుండా వ్యక్తిగత జీవితాల్లోని విషయాల గురించి కూడా చర్చించుకునే వరకు వచ్చింది. అంతగా వారి మధ్య ఒక స్పెషల్ ఫ్రెండ్షిప్ ఏర్పడటంతో అభిమానుల్లో కూడా వారిపై అమితమైన ఎట్రాక్షన్ మొదలైంది.

బిగ్ రికార్డ్..

బిగ్ రికార్డ్..

అత్తారింటికి దారేది సినిమాతో ఇండస్ట్రీ రికార్డుల బద్దలు కొట్టడంతో ఈ కాంబినేషన్ కి అసలైన బాక్సాఫీస్ మార్కెట్ సెట్టయ్యింది. పవన్ కళ్యాణ్ , త్రివిక్రమ్ అంటే సౌత్ నార్త్ సినిమా ఇండస్ట్రీలలో ఒక రకమైన క్రేజ్ ఏర్పడింది. ఇక అలాంటి వారి కాంబినేషన్ లో మరొక సినిమా రాగా ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచింది.

అజ్ఞాతవాసి గాయం..

అజ్ఞాతవాసి గాయం..

ఆజ్ఞతవాసి దెబ్బ కేవలం వారినే కాకుండా అభిమానులను కూడా చాలానే గాయపరిచింది. ఆ గాయం నుంచి పవర్ స్టార్ అభిమానులు ఇంకా కోలుకోలేకపోతున్నారు. ఇక వకీల్ సాబ్ తో మెప్పిస్తాడాని అనుకున్నప్పటికి ఆ సినిమా ఎలా ఉంటుందో తెరపైకి వచ్చే వరకు తెలియదు. కానీ అందరికి త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ మరో సినిమా చేస్తే బావుంటుందని కోరుకుంటున్నారు.

Recommended Video

#8YrsOfGabbarSingh: Then World Wide Box Office Collections, Now Twitter Records
పవన్ ఒప్పుకోలేదట

పవన్ ఒప్పుకోలేదట

త్రివిక్రమ్ ప్రస్తుతం ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి సిద్దమవుతున్న విషయం తెలిసిందే. అరవింద సమేత తరువాత, అలాగే అల.. వైకుంఠపురములో సినిమాల తరువాత త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ ని కలిసి కొన్ని కథలను వినిపించాడట. కానీ అందుకు ఆయన ఒప్పుకోలేదని తెలుస్తోంది. దానికి కారణం.. కథ నచ్చకపోవడమేనట. కథలు బావున్నా కూడా పవన్ తనకు సెట్టవ్వవని చెప్పేశాడట. పవన్ నో చెప్పినప్పటికీ త్రివిక్రమ్ మాత్రం పవన్ కళ్యాణ్ కోసం ఎలాగైనా ఒక సాలీడ్ కథను సెట్ చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X