»   » 60 కోట్లకు పవన్ కళ్యాణ్ నో...గొప్పగా చెప్పుకుంటున్న ఫ్యాన్స్!

60 కోట్లకు పవన్ కళ్యాణ్ నో...గొప్పగా చెప్పుకుంటున్న ఫ్యాన్స్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: డబ్బే సర్వస్వం కాదని పవన్ కళ్యాణ్ చాటి చెప్పారని ఇపుడు మెగా ఫ్యాన్స్ సర్కిల్‌లో చర్చ సాగుతోంది. ఇలాంటి చర్చ ప్రచారంలోకి రావడానికి కారణం పవన్ కళ్యాణ్ గురించి ఓ వార్త ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతుండటమే. పవన్ కళ్యాణ్‌కు బాలీవుడ్ సినీ నిర్మాణ సంస్థ యూ టీవీ మోషన్ పిక్చర్స్ 60 కోట్లతో గాలం వేసే ప్రయత్నం చేసిందని ఆ వార్తల సారాంశం.

పవన్ కళ్యాణ్ తమ బ్యానర్లో వరుసగా మూడు సినిమాలు చేయడానికి రూ. 60 కోట్లు ఆ సంస్థ ఆఫర్ చేసిందని, అయితే పవన్ కళ్యాణ్ ఆ ఆఫర్ తిరస్కరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తన అభిరుచి ప్రకారమే సినిమాలు చేస్తానే తప్ప ఇలా గంపగుత్తగా ఇచ్చేకోట్ల ఆఫర్ల కోసం తాను సినిమాలు చేయనని పవన్ తెగేసి చెప్పినట్లు సమాచారం.

Pawan Kalyan

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుసగా రెండు ప్రాజెక్టులకు సైన్ చేసారు. అందులో ఒకటి సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'గబ్బర్ సింగ్-2'. ఈ చిత్రం షూటింగ్ ఇటీవల ఫిల్మ్ నగర్లో నిరాడంబరంగా ప్రారంభమైంది. పవన్ ఫ్రెండ్ శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ నిర్మాత. ఈ చిత్రానికి హీరోయిన్ ఇంకా ఖరారు కాలేదు.

దీంతో పాటు మరో మల్టీ స్టారర్ చిత్రానికి కూడా పవన్ కళ్యాణ్ ఓకే చెప్పారు. హిందీలో సూపర్ హిట్ అయిన 'ఓ మై గాడ్' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈచిత్రంలో వెంకటేష్‌తో కలిసి నటించబోతున్నారు పవన్. ఇందులో పవన్ కళ్యాణ్ లార్డ్ శ్రీకృష్ణా పాత్రలో కనిపించనున్నారు.

English summary
Pawan has lot of craze not only in the fans but also in the producers. Big producers are showing interest in making films with Pawan. U tv motion pictures is one of them. Recently it offered Pawan with 60 crores for three movies. But news is that Pawan rejected the offer.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu