పవన్ కళ్యాణ్ మరో డైరక్టర్ ని రిజెక్టు చేసారు

By Srikanya

పవన్ కళ్యాణ్ తో సినిమా డైరక్షన్ అంటే మాటలు కాదు. ఎందుకంటే హిట్ కొడితే గబ్బర్ సింగ్ లాగ హిట్టు రేంజి ఓ రేంజిలో ఉంటుంది. అలాగే దర్శకుడు హరీష్ శంకర్ లాగ ఓవర్ నైట్ లో అంతులేని పేరు వస్తుంది. దాంతో యంగ్ దర్శకులందరి దృష్టి పవన్ మీదే ఉంది. అయితే ఆయన్ని ఒప్పించటం సామాన్యమైన విషయం కాదని చెప్తూంటారు. తాజాగా దర్శకుడు వీరూ పోట్లకు నో చెప్పాడని సమాచారం. పంజా సమయంలో వీరూ పోట్ల ..పవన్ ని కలిసారు. ఆ తర్వాత ఓ స్టోరీ లైన్ చెప్పటం జరిగింది. అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్టు మెటీరియలైజ్ కావటం లేదని తెలిసింది. అయితే ఎందుకు రిజెక్టు అయ్యింది ..కథ నచ్చకా లేక డేట్స్ ఎడ్జెస్ట్ చేయలేకా అనేది తెలియరాలేదు.

దాంతో వీరూ పోట్ల తన చిత్రానికి నాగచైతన్యని హీరోగా ఎన్నుకున్నట్లు సమాచారం. రగడ వచ్చి చాలా కాలమైనా ఇప్పటికి వీరు పోట్లకి సినిమా ప్రారంభం కాలేదు. మంచి కథ, నిర్మాత ఉన్నా, హీరోలు దొరకని స్ధితి తెలుగులో ఉంది. 14 రీల్స్ బ్యానర్ పై వీరూ పోట్లకు సినిమా ఉన్నా హీరోల డేట్స్ సమస్యతో ఈ టాలెంటెడ్ డైరక్టర్ ఖాళీగా ఉన్నారు. నవంబర్ నుంచి నాగచైతన్య డేట్స్ దొరకి సినిమా ప్రారంభించనున్నట్లు సమాచారం.

ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రం హడావిడిలో ఉన్నారు. ఆ షూటింగ్ అయిన తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేసే అవకాసముందని తెలుస్తోంది. అలాగే ఖుషీ తర్వాత పదేళ్ల అనంతరం ఆ రేంజి హిట్ కొట్టారు పవన్ కళ్యాణ్ అని చెప్పుకుంటున్న నేపధ్యంలో గణేష్ కి మరో సినిమా కి డేట్స్ ఇస్తానని పవన్ ప్రామిస్ చేసాడని సమాచారం. పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై ఆ చిత్రం చేస్తానని చెప్పారని సమాచారం. అయితే ఆ చిత్రం కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రం షూటింగ్ పూర్తయ్యాక చేద్దామని,ఈ లోగా..కథ,దర్సకుడు పైనలైజ్ చేద్దామని చెప్పారని పిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X