పవన్ ఓ పారిన్ లేడీతో సంభంధం అంటూ...
పవన్ కళ్యాణ్ పై ఎన్నడూ లేని విధంగా ఓ రూమర్ ప్రచారంలోకి వచ్చింది. అతను ఓ ఫారినర్ తో సంభందం పెట్టుకున్నాడని, ఆమె తీన్ మార్ టైమ్ లో పరిచయమైందని చెప్తున్నారు. ఆమెకు పంజా చిత్రంలో వేషం ఇప్పించి షూటింగ్ టైమ్ లో తనతో ఉంచుకున్నాడని రోజుకో రకంగా పుకార్లు లేపుతున్నారు. ఇక మరో ప్రక్క పవన్ ఈ రూమర్స్ కి సంభంధం లేనట్లుగా కంటిన్యూ షూటింగ్స్ తో బిజీగా ఉంటున్నారు. మొన్నటి వరకూ పంజా షూటింగ్ లో బిజీగా ఉన్న పవన్ కంటిన్యూగా యాభై రోజుల షెడ్యూల్ లో పాల్గొనటానికి ప్లాన్ చేసుకున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న గబ్బర్ సింగ్ కోసం పవన్ ఈ షెడ్యూల్ ఓకే చేసారు. అక్టోబర్ పదవ తేది నుండి ఈ చిత్రం షూటింగ్ లో పాల్గొంటాడు.
ఆల్రెడీ ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమై పోయి కొన్ని పవన్ లేని సీన్స్ షూట్ చేసేస్తున్నారు. ఇక తమిళనాడులోని పొల్లాచ్చి ప్రాంతంలో ఈ షూటింగ్ జరుగుతోంది. అక్కడ జాయిన్ అవుతారు పవన్ కళ్యాణ్. యాభై రోజుల షెడ్యూల్ లో మాగ్జిమం టాకీ పార్ట్ అవకొట్టాలని నిర్ణయించుకున్నారు. ఇక ఈ చిత్రంలో ఐటమ్ సాంగ్ కోసం ఓ బాలీవుడ్ నటిని ఒప్పించటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే దేవిశ్రీ ప్రసాద్ రెండు పాటల రికార్టింగ్ పూర్తి చేసారు. ఇక దబాంగ్ రీమేక్ గా రూపొందుతోన్న గబ్బర్ సింగ్ చిత్రాన్ని నిర్మాత గణేష్ బాబు.. ఎట్టి పరిస్దితుల్లోనూ సంక్రాంతికే విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ చిత్రంలో శృతిహాసన్, సుహాసిని, అభిమన్యు సింగ్, నాగినీడు కీలకపాత్రలు పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











