హరి హర వీరమల్లుకు పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్.. తీసుకున్నది ఇంతేనా? షాకింగ్

పవర్ స్టార్ పవర్ స్టార్ మరోసారి గొప్ప మనస్సును చాటుకున్నారు. తను ఎలాంటి పరిస్థితుల్లో ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం పవన్ కళ్యాణ్ గుణమనే విషయం తెలిసిందే. ఇక తాజాగా హరి హర వీరమల్లు నిర్మాతకు తను ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే కాకుండా మరో త్యాగం కూడా చేశారు. మరికొద్దిరోజుల్లో ఈ చిత్రం విడుదల కాబోతుండటంతో ప్రస్తుతం ప్రచార కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సినిమా ఎప్పుడూ థియేటర్లలోకి వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా విషయంలో పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్య పరుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే...

పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు రెమ్యునరేషన్..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైన్ చేసిన చిత్రాల్లో హరి హర మీరమల్లు చిత్రం ఒకటి. ఈ చిత్రం ప్రారంభమైనప్పటికీ నుంచి వాయిదాలు పడుతూనే వస్తోంది. ఎన్నో సవాళ్లను దాటుకొని చివరికి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ప్రస్తుతం టీమ్ ప్రమోషన్స్ పై శ్రద్ధ వహించింది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ గురించి ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి తెలిసింది. పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు చిత్రానికి తీసుకున్న పారితోషికం కేవలం రూ.11 కోట్లు మాత్రమేనని తెలుస్తోంది. దీంతో ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఆ అమౌంట్ ను మొత్తం పారితోషికంగా తీసుకోలేదంట. కేవలం అడ్వాన్డ్స్ రూపంలో తీసుకున్నారంట. కానీ ఆ తర్వాత మళ్లీ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదంట. ప్రస్తుతం కూడా రెమ్యునరేషన్ అడగకపోవడం హాట్ టాపిక్ గ్గా మారింది.

Pawan Kalyan Remuneration for Hari Hara Veera Mallu Movie is shocking

పారితోషికం తిరిగి ఇచ్చిన పవన్ కళ్యాణ్..
నిర్మాతల గురించి ఆలోచించే నటుల్లో పవన్ కళ్యాణ్ ముందుంటారు. తనతో సినిమా చేసి నష్టాల పాలైతే ఆ నిర్మాత దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ ఒక్క రూపాయి కూడా తీసుకోరు. ఆ విషయం అందరికీ తెలిసిందే. కానీ హరి హర వీరమల్లు చిత్రం విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకున్నారంట. పవన్ కళ్యాణ్ ఆ సినిమా నిర్మాత దగ్గర తీసుకున్న అడ్వాన్స్ లో రూ.10 కోట్లను తిరిగి ఇచ్చేశారంట. సినిమా ఆలస్యం అయినందుకు గాను నిర్మాత కష్టనష్టాలను ఆలోచించి పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.

హరి హర వీరమల్లు వివరాలు..
ఈ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ లో ఏఎం రత్నం నిర్మించారు. క్రిష్ తర్వాత ఏఎం జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలను తీసుకున్నారు. బాబీ డియోల్ విలన్ పాత్ర పోషించారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. నోరా ఫతేహి, అనసూయ కీలక పాత్రను పోషించారు. రూ.200 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు.

మరోసారి రిలీజ్ వాయిదా..
హరిహర వీరమల్లు చిత్రం ఇప్పటికే తొమ్మిది సార్లు వాయిదా పడింది. ఇక ఎట్టకేళ్లకు జూన్ 12న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నామని రీసెంట్ గా అనౌన్స్ చేశారు. కానీ తాజాగా మరోసారి పోస్ట్ పోన్ కానుందని తెలుస్తుంది. బెస్ట్ వీఎఫ్ఎక్స్ కారణంగా మరోసారి జూలై 4కు వాయిదా వేయబోతున్నార తెలుస్తోంది. అందుకే ప్రీ రిలీజ్ వేడుకను కూడా వాయిదా వేసినట్టు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X