For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘సర్దార్‌‌’‌: పవన్ రెమ్యునేషన్, మెగా హీరోల సైలెంట్, కొత్త ప్రోమోలు..ఇంకా

  By Srikanya
  |

  హైదరాబాద్‌: పవన్‌కల్యాణ్‌ హీరోగా నటించిన చిత్రం ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'. ఈ చిత్రం విడుదల కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్‌ 8న సర్దార్‌ ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో ఈ చిత్రం కోసం పవన్ ఎంత రెమ్యునేషన్ తీసుకున్నారనే విషయం చర్చనీయాంశంగా మారింది.

  అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం కోసం పవన్ ...33 కోట్ల రూపాయలు రెమ్యునేషన్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తం ఇప్పటివరకూ ఏ తెలుగు హీరో తీసుకోలేదు.

  ఈ చిత్రంలో కాజల్‌ తొలిసారి పవన్‌కల్యాణ్‌తో జంటగా నటించారు. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శరత్‌ మరార్‌, సునీల్‌ లుల్లా నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం సమకూర్చారు. 2012లో విడుదలై విజయం సాధించిన ‘గబ్బర్‌సింగ్‌' చిత్రానికి ఫ్రాంచైజ్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

  స్లైడ్ షోలో మరిన్ని ఆశ్చర్యం గొలిపే విశేషాలు..

  బిజినెస్ విషయానికి వస్తే...

  బిజినెస్ విషయానికి వస్తే...

  నిర్మాతలు కూడా పూర్తి సేఫ్. చిత్రం ధియోటర్ రైట్స్ ని ఈరోస్ వారికి 72 కోట్లుకు అమ్మారు. అందులోనే ఆడియో రైట్స్, శాటిలైట్, డబ్బింగ్ రైట్స్, యూ ట్యూబ్ రైట్స్ అన్నీ ఉన్నాయి. వారు ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ని వంద కోట్లు వరకూ చేసినట్లు సమాచారం.

  నార్త్ ,సౌత్ తేడా లేదు

  నార్త్ ,సౌత్ తేడా లేదు  సినిమా మొదలైన దగ్గర నుంచే సంచలనాలకు తెరతీసిన సర్దార్ గబ్బర్ సింగ్ రిలీజ్ విషయంలో కూడా అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి రిలీజ్ అవుతున్న సర్దార్ గబ్బర్ సింగ్ ను సౌత్, నార్త్ తో పాటు ఓవర్ సీస్ లో కూడా భారీగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

  భారీ ఎత్తున

  భారీ ఎత్తున


  గతంలో మరే తెలుగు సినిమా రిలీజ్ కాని విధంగా భారీగా ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్.

  యుఎస్ లో

  యుఎస్ లో


  అలాగే.. అమెరికాలో తెలుగు సినిమాలు 100 థియేటర్ల లోపు రిలీజ్ అవుతాయి. కానీ సర్దార్‌ను మాత్రం ఏకంగా 188 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు.

  ఓవర్ సీస్ లో ..

  ఓవర్ సీస్ లో ..

  అంతేకాదు ఓవర్ సీస్ మొత్తంలో 42 దేశాల్లో 400కు పైగా థియేటర్లలో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు.

  బాలీవుడ్ లోనూ..

  బాలీవుడ్ లోనూ..

  ఇక బాలీవుడ్ లో కూడా ఈ సినిమాను 800 స్క్రీన్స్ మీద రిలీజ్ చేయడానికి ఈరోస్ సంస్థ ప్లాన్ చేస్తోంది.తెలుగు మార్కెట్ మరింత సంచలనంగా మారనుంది.

  ఇక్కడ ఎన్నంటే...

  ఇక్కడ ఎన్నంటే...

  తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాతో పాటు మరేమి సినిమా రిలీజ్ కు సాహసించటం లేదు కాబట్టి 1400 థియేటర్లలో ఈ సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.

  బెనిఫిట్ షోలు కూడా..

  బెనిఫిట్ షోలు కూడా..

  వీటికితోడు చాలా ప్రాంతాల్లో బెనిఫిట్ షోలను కూడా భారీ సంఖ్యలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.

  ఫస్ట్ డే రికార్డ్ లు..

  ఫస్ట్ డే రికార్డ్ లు..

  ఈ హడావిడి చూస్తుంటే తొలిరోజు వసూళ్లో సర్దార్ రికార్డుల మోత మోగించటం గ్యారంటీ అన్న టాక్ వినిపిస్తోంది.

  సైలెంట్ అయ్యారు

  సైలెంట్ అయ్యారు

  బయటి హీరోల సినిమాల విషయంలో కూడా యాక్టివ్ గా కామెంట్లు చేసే అల్లు శిరీష్, సాయి ధరమ్ తేజ్ కూడా సర్దార్ విషయంలో సైలెంట్ అయిపోయారు.

  రామ్ చరణ్ కూడా..

  రామ్ చరణ్ కూడా..

  ఆడియో బాగుందటూ ట్వీట్ చేసి సరిపెట్టేసిన రామ్ చరణ్ కూడా ట్రైలర్ విషయంలో ఎలాంటి కామెంట్ చేయలేదు.

  బన్నీ కూడా పట్టించుకోలేదే

  బన్నీ కూడా పట్టించుకోలేదే

  తను సినిమాల గురించి ట్వీట్ చేయనంటూనే క్షణం సినిమాను పొగిడేసిన బన్నీ కూడా ఈ సినిమా విషయంలో నోరు మెవపలేదు.

  వరుణ్ తేజ రెస్పాన్స్ ఏది

  వరుణ్ తేజ రెస్పాన్స్ ఏది

  మేకింగ్ వీడియో రిలీజ్ అయినప్పుడే తెగ హడావిడి చేసిన వరుణ్ తేజ్.. ఆడియో, థియట్రికల్ ట్రైలర్ ల రిలీజ్ తరువాత ఒక్క ట్వీట్ కూడా చేయలేదు.

  డౌట్

  డౌట్

  మెగా హీరోలు బిజీగా ఉండి సర్దార్ గబ్బర్ సింగ్ ను పట్టించుకోలేదా..? లేక నిజంగానే ట్రైలర్ నచ్చక సైలెంట్ అయిపోయారా..? అన్న అనుమానం అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా కలుగుతోంది.

  ఆ ప్రాంతం కథ

  ఆ ప్రాంతం కథ

  ఖమ్మం, ఛత్తీస్‌ఘడ్‌ సరిహద్దుల్లో జరిగే కథ ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'. అలాంటి వాతావరణాన్నే సెట్లో ప్రతిబింబించాలనుకొన్నారు పవన్‌ కల్యాణ్‌.

  కథ అనుకున్నప్పుడే..

  కథ అనుకున్నప్పుడే..

  ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే రాసుకొన్నారు పవన్‌. కథ అనుకొన్నప్పుడే సెట్‌ ఎలా ఉండాలి? అనే విషయాన్ని క్షుణ్నంగా రాసుకొన్నారట.

  సెట్ లో..

  సెట్ లో..

  మొత్తం ఐదెకరాల విస్తీర్ణంలో... పోలీస్‌ స్టేషన్‌, వెడల్పాటి రోడ్లు, దుకాణాలు, పాఠశాల, వాటర్‌ ట్యాంక్‌, పెట్రోలు బంకు, చెక్‌ పోస్టు, గ్రంథాలయం... ఇలా ఓ వూరిలో ఉండే భవనాలన్నీ కట్టేశారు.

  సెట్ కోసం

  సెట్ కోసం

  అందుకోసం దాదాపు 45 రోజుల పాటు, 500 మంది కార్మికులు రాత్రింబళ్లు పనిచేయాల్సివచ్చింది.

  కష్టపడ్డారు

  కష్టపడ్డారు

  నిజానికి రెండు నెలల్లో పని పూర్తవ్వాలని చెప్పారు. చివరికొచ్చేసరికి 45 రోజుల సమయం దొరికింది. ఒక్క క్షణం వూపిరి తీసుకోకుండా సెట్‌ కోసం కష్టపడ్డాం అంటున్నారు కళా దర్శకుడు బ్రహ్మ కడలి

  మినియేచర్

  మినియేచర్

  సాధారణంగా సెట్‌ వేసే ముందు స్కెచ్‌లు గీస్తుంటారు. సెట్‌ ఎలా ఉండబోతోందో చెప్పడానికి ఇవి దోహదపడతాయి. కానీ అందులో సెట్‌ విస్తీర్ణం, ఒకొక్క నిర్మాణంలో ఏమేం ఉండబోతున్నాయనే విషయాల్లో స్పష్టత ఉండదు. అందుకే మేం మినియేచర్‌లపై ఆధారపడ్డాం.

  కలర్ టోన్..

  కలర్ టోన్..

  సెట్‌ కలర్‌ ఏ టోన్‌లో ఉండాలి అనే విషయంపై పవన్‌ కల్యాణ్‌ ముందే స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. కాబట్టి కలర్‌ కాంబినేషన్‌ గురించి పెద్దగా ఆలోచించలేదు.

  అంతా కలిసి కూర్చుని

  అంతా కలిసి కూర్చుని

  దర్శకుడు, కెమెరామెన్‌, కాస్ట్యూమ్‌ డిజైనర్‌ మేమంతా కూర్చుని సెట్‌ గురించి చర్చించుకొన్నాం'' అంటున్నారు బ్రహ్మ కడలి.

  పవన్ ముందే చెప్పారు

  పవన్ ముందే చెప్పారు

  సాధారణంగా ఏ సెట్‌ వేసినా రోడ్ల వెడల్పు అరవై అడుగులు ఉండేలా చూస్తారు. రతన్‌పూర్‌ రోడ్డు వంద అడుగులు ఉండాల్సిందే అని పవన్‌ ముందే చెప్పారట.

  చిత్రంగా..

  చిత్రంగా..

  ‘సర్దార్‌..' గమనిస్తే రైల్వే ట్రాక్‌ చిత్రంగానే ఉంటుంది. రోడ్డుకి ఐదు అంగులాల ఎత్తులో రైల్వే ట్రాక్‌ ఉంటుంది. అదీ చిత్రీకరణ సౌలభ్యం కోసం చేసిన మార్పు అంటున్నారు బ్రహ్మ కడలి.

  పవన్ కే అవగాహన

  పవన్ కే అవగాహన

  ‘‘విజువల్‌గా ఈ సినిమా ఎలా ఉండబోతోంది? అనే విషయంలో పవన్‌ కల్యాణ్‌ గారికి అవగాహన ఉంది.

  షాట్స్ అనుకునే...

  షాట్స్ అనుకునే...

  క్రేన్‌ షాట్స్‌ ఎక్కడ వాడతారు? జూమ్‌ ఎక్కడ, ట్రాలీ సీన్‌ ఏది? ఇవన్నీ స్క్రిప్టు దశలోనే తెలిసిపోయాయి. దానికి అనుగుణంగానే సెట్‌ నిర్మాణం సాగింది'' అంటున్నారాయన

  స్పెషల్ గా..

  స్పెషల్ గా..

  ‘సర్దార్‌...' ట్రైలర్ లో పవన్‌ రెండు చేతుల్లో రెండు తుపాకులు పట్టుకొని బుల్లెట్ల వర్షం కురిపించే సన్నివేశాలు కనిపిస్తున్నాయి. దానికి తోడు ఈ సినిమాలో బ్రహ్మానందానికి తుపాకులు అమ్మే దుకాణమే ఉంది. అందుకే ‘సర్దార్‌...' టీమ్‌ పవన్‌ కోసం గన్నులు తయారు చేసింది.

  అన్ని తుపాకులు

  అన్ని తుపాకులు

  దాదాపు 700 తుపాకులను కళా దర్శకత్వ యూనిట్ తయారు చేసింది.

  ధర్మాకోల్ తో ..

  ధర్మాకోల్ తో ..

  తేలికపాటి లోహంతో, థర్మాకోల్‌తో తుపాకుల్ని తయారు చేశారట.

   కౌబాయ్ చిత్రంలా..

  కౌబాయ్ చిత్రంలా..


  పెద్ద పెద్ద చక్రాల ఆటో రిక్షా బళ్లు, కౌబోయ్‌ చిత్రాల్లో కనిపించే టాప్‌లెస్‌ కార్లు కూడా కొత్తగా సృష్టించాల్సివచ్చింది.

  కౌబోయ్ లుక్

  కౌబోయ్ లుక్

  ‘‘ఈ సినిమా వెస్ట్రన్‌, కౌబోయ్‌ చిత్రాల లుక్‌లో సాగుతుంది. సెట్లో వాతావరణం కూడా అలానే కనిపించేలా జాగ్రత్త తీసుకొన్నాం. ఎక్కడ చూసినా మట్టి రంగు కూడా ఒకేలా ఉండడానికి... లారీల కొద్దీ మట్టిని తీసుకొచ్చాం.

  సెట్ ప్రాపర్టీ

  సెట్ ప్రాపర్టీ

  సినిమాలోని ప్రతీ సన్నివేశంలోనూ ఏదో ఓ చోట సెట్‌ ప్రాపర్టీ కనిపిస్తుంది. రతన్‌పూర్‌లో కనిపించే ప్రతీ వస్తూవూ చేత్తో తయారు చేసిందే.

  మర్చిపోలేని చిత్రం

  మర్చిపోలేని చిత్రం

  తక్కువ రోజుల్లో నాణ్యమైన పనితనం ఎలా చూపించాలో ఈ సినిమాతో తెలుసుకొన్నా. అందుకే ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' నా జీవితంలో మర్చిపోలేని చిత్రం'' అంటున్నారు బ్రహ్మ కడలి.

  స్టోరీ బోర్డ్‌ యానిమేషన్‌

  స్టోరీ బోర్డ్‌ యానిమేషన్‌


  స్క్రిప్టులో భాగంగా స్టోరీ బోర్డ్‌ని తయారు చేసుకోవడం మామూలే. ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' కోసం ఈ స్టోరీ బోర్డ్‌ యానిమేషన్‌ రూపంలో తయారైంది.
  అంటే.. సన్నివేశాన్ని ముందే యానిమేషన్‌లో చూసేసుకొంటారన్నమాట.

  నిర్మాత శరత్‌ మరార్‌ మాట్లాడతూ

  నిర్మాత శరత్‌ మరార్‌ మాట్లాడతూ

  ‘‘నాలుగేళ్ల క్రిందటే పవన్‌ కల్యాణ్‌ ‘సర్దార్‌...' కసరత్తులు మొదలెట్టేశారు. ఏ సన్నివేశం ఎలా ఉండాలో ఆయన వూహల్లో ఎప్పుడో నిక్షిప్తమై ఉంది. యానిమేషన్‌ స్టోరీ బోర్డ్‌ అన్న ఆలోచన కూడా ఆయనదే.

  కీ సీన్స్ అన్నీ..

  కీ సీన్స్ అన్నీ..

  కొన్ని కీలకమైన సన్నివేశాల్ని, యాక్షన్‌ ఘట్టాల్ని ముందే యానిమేషన్‌లో రూపొందించాం. ఫైట్‌ ఏస్థాయిలో ఉంటుందో ముందే వూహించి యానిమేషన్‌లో తీర్చిదిద్దాం.

  ఇంత పెద్ద స్పాన్..

  ఇంత పెద్ద స్పాన్..

  వాటిని రామ్‌ లక్ష్మణ్‌ మాస్టర్లు మరో స్థాయికి తీసుకెళ్లే అవకాశం వచ్చింది. ఇంత పెద్ద స్పాన్‌ ఉన్న ఈ సినిమాని తక్కువ రోజుల్లో పూర్తి చేయడానికి కారణం కూడా యానిమేషన్‌ స్టోరీ బోర్డే'' అన్నారు.

  నిద్రపోనివ్వకుండా చేసారు

  నిద్రపోనివ్వకుండా చేసారు

  సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో వేడుకలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ...సినిమా ఏప్రిల్ లో విడుదల కావాలని నేను నిద్రపోలేదు. 50 రోజుల పాటు అందరినీ ఏడ్పించేశాను. డైరెక్టర్ బాబీ సహా అందరూ ఎంతో సపోర్ట్ చేశారు అందరికి చాల థాంక్స్ అని తెలిపారు.

  మెచ్చుకున్నారు.

  మెచ్చుకున్నారు.

  ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు గురువారం పూర్తి చేసుకుంది. ఈ సినిమా ఫై సెన్సార్ వాళ్ళు కూడా మంచి చిత్రం అంటూ టీం కు అబినందనలు తెలిపారు.

  ఖాకీ కట్టారు మరి..

  ఖాకీ కట్టారు మరి..

  పవన్‌ కల్యాణ్‌ ఖాకీ కడితే ఆ ప్రభంజనం ఎలా ఉంటుందో 'గబ్బర్‌ సింగ్‌'లో చూశాం. 'నాక్కొంచెం తిక్కుంది. దానికో లెక్కుంది' అంటూ డైలాగులనే బులెట్లులా పేల్చారు అందులో. ఇప్పుడు మళ్లీ పవన్‌ కల్యాణ్‌ పోలీస్‌ అవతారం ఎత్తాడు. మరోసారి లాఠీ పట్టి హంగామా చేయబోతున్నాడు.

  English summary
  Sources say that Pawan Remuneration is Rs 33 crores for Sardar Gabbar Singh which is highest for any Telugu actor.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X