»   » చిరు వల్లే...రేణుతో పవన్ బలవంతపు పెళ్లి?(ఫోటో ఫీచర్)

చిరు వల్లే...రేణుతో పవన్ బలవంతపు పెళ్లి?(ఫోటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండో వివాహం రేణు దేశాయ్‌తో జరిగిన సంగతి తెలిసిందే. వీరి వివాహం ఏ పరిస్థితుల్లో జరిగిందో అందరికీ తెలిసిందే. సినిమా మెగాస్టార్‌ నుండి పొలిటికల్‌ స్టార్‌గా చిరంజీవి రాజకీయ తెరంగ్రేటం చేసిన సమయంలో.....ప్రత్యర్థి పార్టీల విమర్శలకు చెక్ పెట్టేందుకు పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్ అప్పట్లో పెద్దగా ఆర్బాటాలక పోకుండా పెళ్లాడారు.

పెళ్లి ముందే పవన్, రేణు దేశాయ్ అకీరా నందన్‌కు జన్మనిచ్చారు. ఇదంతా గతం. అయితే పవన్-రేణు దేశాయ్ ప్రస్తుతం విడిపోయారు. తాజాగా పవన్ కళ్యాణ్ ఓ విదేశీ అమ్మాయిని మూడో పెళ్లి చేసుకున్నట్లు కూడా ఆ మధ్య మీడియాలో చర్చనీయాం అయింది. తాజాగా పవన్ పొలికల్ పార్టీ పెడుతున్న నేపథ్యంలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

అప్పట్లో పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి బలవంతం మేరకే రేణు దేశాయ్‌ని పెళ్లాడారా? అంటే అవుననే వార్తలు మీడియా సర్కిల్లో, ప్రముఖ దినపత్రికల్లో చక్కర్లు కొడుతున్నారు. స్లైడ్ షో అందుకు సంబంధించిన వివరాలు...

రేణుతో పెళ్లి విషయమై పవన్-చిరు మధ్య వాగ్వావాదం

రేణుతో పెళ్లి విషయమై పవన్-చిరు మధ్య వాగ్వావాదం

రేణు దేశాయ్‌తో పెల్లి అంశానికి సంబంధించిన ఇటీవల చిరంజీవి, పవన్ మధ్య వాగ్వాదం జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నీ కోసం నేను రేణు దేశాయ్‌ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవితో వాదనకు దిగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఓ ప్రముఖ దిన పత్రికలో వార్తలు వచ్చాయి.

పవన్ పార్టీ పెట్టడం చిరుకు నచ్చడం లేదా?

పవన్ పార్టీ పెట్టడం చిరుకు నచ్చడం లేదా?

పవన్ కళ్యాన్ పార్టీ పెట్టడం చిరంజీవికి అసలు నచ్చడం లేదని మీడియా టాక్. పవన్ పార్టీ గురించి ఇటీవల మీడియాలో వార్తలు రావడంతో షాకైన చిరంజీవి, నాగబాబును తీసుకుని పవన్ వద్దకు వెళ్లి దీనిపై ప్రశ్నించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

పీఆర్పీ విలీనం పవన్‌కు నచ్చలేదా?

పీఆర్పీ విలీనం పవన్‌కు నచ్చలేదా?

పీఆర్పీ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం పవన్ కళ్యాణ్‌కు నచ్చలేదని, ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి ముందు కుండబద్దలు కొట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

విలీనంతో మొదలై ఆరెంజ్ సినిమాతో ముదిరాయా?

విలీనంతో మొదలై ఆరెంజ్ సినిమాతో ముదిరాయా?

ఓ ప్రముఖ పత్రికలో వచ్చిన వార్తల ప్రకారం మెగా బ్రదర్స్ మధ్య పీఆర్పీ విలీనం అంశంతో మొదలైన విబేధాలు...రామ్ చరణ్ తో నాగబాబు నిర్మించి ‘ఆరెంజ్' ప్లాపుతో ముదిరాయని, ఆరెంజ్‌తో నష్టపోయిన నాగబాబును చిరంజీవి పట్టించుకోలేదని, అప్పుడు పవన్ కళ్యాణే ఆదుకున్నాడని టాక్.

బాబాయ్‌కి సపోర్టు ఇవ్వను: రామ్ చరణ్

బాబాయ్‌కి సపోర్టు ఇవ్వను: రామ్ చరణ్

బాబాయ్ పవన్ కళ్యాణ్ కొత్త పార్టీ పెట్టడంపై రామ్ చరణ్ మాట్లాడుతూ.....వ్యక్తిగతంగా ఎవరి దారులు వారికి ఉంటాయి. బాబాయ్ కొత్త పార్టీ పెడితే నేను సపోర్టు ఇవ్వను, నాన్న చిరంజీవికే నా మద్దతు ఉంటుందని రామ్ చరణ్ తేల్చి చెప్పారు.

కొత్త పార్టీతో ఫలితం ఉండదని చిరంజీవి పవన్‌ను ఆపే ప్రయత్నం?

కొత్త పార్టీతో ఫలితం ఉండదని చిరంజీవి పవన్‌ను ఆపే ప్రయత్నం?

కొత్త పార్టీతో ఎలాంటి ఫలితం ఉండదని, తాను పార్టీ పెడితే కేవలం 18 సీట్లే వచ్చాయి. రేపు నీకు కూడా అదే పరిస్థితి ఎదురవుతుందని చెబుతూ...పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టే ప్రయత్నాన్ని చిరంజీవి అడ్డుకునే ప్రయత్నం చేసినట్లు వార్తాపత్రిల్లో కథనాలు వెలువడ్డాయి.

English summary
Film Nagar Sources add, Pawan Kalyan had married his live-in partner Renu Desai only to save Chiranjeevi from embarrassment and unsavory remarks during the 2009 elections.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu