పవన్ కళ్యాణ్ బాక్స్ఆఫీ బద్దలుకొట్టాలంటే అలాంటి సాంగ్ ఉండాల్పిందే....
పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. త్రిష కథానాయిక. పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై గణేష్‌బాబు నిర్మిస్తున్నారు. ఇటీవల కాశీలో కొంత భాగం చిత్రీకరించారు. ఈ చిత్రానికి 'లవ్లీ' అనే పేరును పరిశీలిస్తున్నారు. 'ఖుషిగా' అనే పేరు కూడా చర్చల్లో ఉంది. బాలీవుడ్ లో ఘన విజయం సాధించిన 'లవ్ ఆజ్ కల్' చిత్రం ఆధారంగా అల్లుకొన్న కథ ఇది. పవన్ శైలికి అనుగుణంగా కొన్ని మార్పులు చేశారు.
పవన్ కళ్యాణ్ నటించిన 'తమ్ముడు" సినిమాలో పవన్ కళ్యాణ్ ఎక్సర్ సైజ్ లు చేస్తున్నప్పుడు 'లుక్ ఎట్ మై ఫేస్ ఇన్ ది మిర్రర్.." అనే ఇంగ్లీష్ పాట ఉంది. ఇదిలా ఉంటే 'లవ్ ఆజ్ కల్" రీమేక్ "లో కూడా పవన్ కళ్యాణ్ ఫుల్ లెంగ్త్ ఇంగ్లీష్ సాంగ్ ఉందని సమాచారం. ఈ చిత్రానికి త్రివిక్రమ్ సంభాషణలు సమకూర్చడం విశేషం. కాగా సంగీతం: మణిశర్మ అందిస్తున్నారు. ఈ ఇంగ్లీష్ పాటను ఎవరు రాస్తున్నారనేది ఇంకా బయటికి రాలేదు. సినిమాలో ఇది పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ సాంగ్ అని సమాచారం.


Click it and Unblock the Notifications











