హాట్ టాపిక్: రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చేసిన పవన్ కల్యాణ్.. తన ప్రత్యేకతను చాటుకున్న పవర్ స్టార్.!

By Manoj

తెలుగు సినీ ఇండస్ట్రీలోనే అత్యంత ప్రజాధరణ ఉన్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకరు. మెగా ఫ్యామిలీకి చెందిన హీరోనే అయినా తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకుని తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. కెరీర్ ఆరంభంలోనే ప్రయోగాత్మక చిత్రాల్లో నటించి మెప్పించిన పవన్... ఈ క్రమంలోనే పలు సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక, రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న ఆయన.. ఓ విషయంలో ప్రత్యేకతను చాటుకున్నారు. ఆ వివరాలేంటో చూద్దాం.!

ఎక్కడ చూసినా దాని గురించే చర్చ

ఎక్కడ చూసినా దాని గురించే చర్చ

కొద్ది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశం అవుతున్న అంశాల్లో పవన్ కల్యాణ్ రీఎంట్రీ ఒకటి. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అజ్ఞాతవాసి' తర్వాత మరో సినిమాలో నటించని ఆయన.. చాలా గ్యాప్ అనంతరం సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. దీంతో ఎక్కడ చూసినా పవన్ కల్యాణ్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఎన్నో వార్తలు ప్రచారం అవుతున్నాయి.

దూకుడు చూపిస్తున్న పవన్ కల్యాణ్

దూకుడు చూపిస్తున్న పవన్ కల్యాణ్


తన రీఎంట్రీపై జనాల్లో ఉన్న అంచనాలకు అనుగుణంగానే పవన్ కల్యాణ్ దూకుడును ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఏకంగా మూడు ప్రాజెక్టులను ఓకే చేసేశారు. అందులో ఒకటి వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ‘పింక్' రీమేక్ కాగా, క్రిష్ తెరకెక్కిస్తున్న పిరియాడిక్ మూవీ మరొకటి. వీటితో పాటు హరీశ్ శంకర్ దర్శకత్వంలోనూ ఆయన సినిమా చేస్తున్నాడు.

ప్రకటించకుండానే పని మొదలు పెట్టాడు

ప్రకటించకుండానే పని మొదలు పెట్టాడు


రీఎంట్రీ ఇస్తున్నట్లు అధికారికంగా ప్రకటించకుండానే పవన్ కల్యాణ్ సినిమా షూటింగుల్లో పాల్గొంటున్నాడు. ఇప్పటికే ‘పింక్' రీమేక్ మొదటి షెడ్యూల్ కూడా పూర్తయింది. అలాగే, క్రిష్ జాగర్లమూడితో చేయబోయే సినిమాకు సంబంధించిన స్క్రీన్ టెస్ట్ కూడా పూర్తయిందని తెలుస్తోంది. ఈ మూడు సినిమాలతో పాటు మరికొన్నింటిని పట్టాలెక్కించబోతున్నాడట పవన్.

రూ. 200 కోట్లతో పవర్ చూపించాడు

రూ. 200 కోట్లతో పవర్ చూపించాడు


పవన్ కల్యాణ్ చాలా గ్యాప్ తర్వాత సినిమాల్లో నటించబోతుండడంతో ఆయన రెమ్యూనరేషన్ గురించి అందరూ చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించిన ఎన్నో వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఇందులో భాగంగానే పవన్ మూడు సినిమాలకు కలిపి రూ. 200 కోట్ల వరకు రెమ్యూనరేషన్‌గా అందుకోబోతున్నాడని ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.

రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చేసిన పవన్

రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చేసిన పవన్


పవన్ రీఎంట్రీ.. వరుసగా మూడు సినిమాలు.. భారీ స్థాయిలో రెమ్యూనరేషన్.. ప్రస్తుతం వీటికి సంబంధించిన చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించిన మరో న్యూస్ లీక్ అయింది. దీని ప్రకారం.. టాలీవుడ్‌లోనే బడా ప్రొడ్యూసర్‌గా వెలుగొందుతున్న ఎస్ రాధాకృష్ణకు పవన్ కల్యాణ్ కొంత డబ్బును వెనక్కి ఇచ్చాడట.

Recommended Video

Pawan Kalyan Appreciates Nithiin And Bheeshma Team | Filmibeat Telugu
తన ప్రత్యేకతను చాటుకున్న పవర్ స్టార్.!

తన ప్రత్యేకతను చాటుకున్న పవర్ స్టార్.!

త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ నటించిన మూడో చిత్రం ‘అజ్ఞాతవాసి'. ఈ చిత్రాన్ని హారిక హాసిని బ్యానర్‌పై ఎస్ రాధాకృష్ణ నిర్మించారు. ఈ సినిమా బాక్సాఫీస్ ముందు బోల్తా పడడంతో నిర్మాతకు నష్టాలు వచ్చాయని ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆ నష్టాలను పూడ్చడానికే పవన్.. ఆయనకు కొంత డబ్బును వెనక్కి ఇచ్చారనే టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X