పవన్ కళ్యాణ్ రూ.40లక్షల వాచ్ పై గోడవెందుకు.. ఇంతకంటే దారుణం మరొకటి ఉండదు!

ప్రస్తుత రోజుల్లో అభిమానం అనేది నిజంగా హద్దులు దాటేస్తోందనే చెప్పాలి. హీరోలు ఎలాంటి విభేదాలు లేకుండా బాగానే ఉన్నప్పటికి ఓ వర్గం ఫ్యాన్స్ మాత్రం ఇంకా నెగిటివ్ ఆలోచనలతోనే ఉన్నారు. కొందరు వారికి ఇష్టమైన హీరోను అభిమానించడం కంటే ఇతర హీరోలను ఎక్కువగా ద్వేషిస్తున్నట్లు సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ చూస్తే చాలా ఈజీగా అర్ధమవుతుంది.

మహేష్ ట్వీట్ చేసినప్పుడు

మహేష్ ట్వీట్ చేసినప్పుడు

పవన్ కళ్యాణ్ చాలా వరకు ఇతర హీరోలతో ఎంత ఫ్రెండ్లిగా ఉంటాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మహేష్ బాబు ఇటీవల బర్త్ డే విషెస్ చెప్పడం ఆ తరువాత పవన్ రిప్లై ఇవ్వడం ఇరు వర్గాల అభిమానులను ఎంతో ఆనందానికి గురి చేశాయి. ఆ ట్వీట్ ఒక్కసారిగా ట్రెండ్ సెట్ చేసింది కూడా. ఆ ట్వీట్ పై కూడా కొందరు నెగిటివ్ కామెంట్స్ చేశారు.

పవన్ పై అనవసరంగా ట్రోలింగ్

పవన్ పై అనవసరంగా ట్రోలింగ్

అసలు మ్యాటర్ లోకి వస్తే పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. వకీల్ సాబ్ షూటింగ్ తో బిజీగా మారింది పవన్ లాయర్ గా నల్లకోటుతో చాలా కూల్ గా కనిపిస్తున్నాడు. ఇక సోషల్ మీడియాలో యాంటీ ఫ్యాన్స్ ఆయన స్టైల్ పై ట్రోలింగ్ కూడా చేయడం స్టార్ట్ చేశారు.

రూ.40లక్షల ఖరీదైన వాచ్

రూ.40లక్షల ఖరీదైన వాచ్

ముఖ్యంగా పవన్ కి సంబంధించిన వాచ్ పై కూడా గొడవలు క్రియేట్ చేస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. పవన్ రోలెక్స్ వాచ్ ధరించి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ కొందరు అదే పనిగా తప్పుడుగా కామెంట్స్ చేస్తున్నారు. సింపుల్ గా ఉంటానని చెప్పే పవన్ ఇప్పుడు రూ.40లక్షల ఖరీదైన వాచ్ ధరించడం ఏమిటని అదే పనిగా ట్రోలింగ్ చేయడం మెగా అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పించింది.

గొడవకు ఎండ్ కార్డ్ పెట్టిన ఫ్యాన్స్

గొడవకు ఎండ్ కార్డ్ పెట్టిన ఫ్యాన్స్

ఇక ఆ గొడవకు ఎండ్ కార్డ్ పెట్టేందుకు పవన్ ఫ్యాన్స్ కూడా భారీ స్థాయిలో క్లారిటీ ఇచ్చేశారు. అది వకీల్ సాబ్ సినిమా షూటింగ్ లో భాగంగా దరించిందని చెబుతూ.. మిగతా సందర్బల్లో పవన్ అలాంటివి ఏనాడైనా దరించాడా అంటూ కౌంటర్లు ఇస్తున్నారు. నిజానికి పవన్ సినిమాలో తప్పిస్తే బయట చాలా సింపుల్ గా ఉంటాడని అందరికి తెలిసిన విషయమే. ఇక పవర్ స్టార్ ఇచ్చిన క్లారిటీతో యాంటీ ఫ్యాన్స్ నెగిటివ్ ప్రచారాలను తగ్గించేశారు.

వకీల్ సాబ్ రిలీజ్ ఎప్పుడంటే?

వకీల్ సాబ్ రిలీజ్ ఎప్పుడంటే?

దిల్ రాజు ప్రొడక్షన్ లో వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న వకీల్ సాబ్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక పవన్ త్వరలోనే షూటింగ్ కి ఎండ్ కార్డ్ పెట్టి సంక్రాంతికి విడుదల చేయాలని నిర్మాతలకు వివరణ ఇచ్చినట్లు సమాచారం. బాలీవుడ్ హిట్ మూవీ పింక్ సినిమాకు ఇది రీమేక్ గా వస్తున్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X