బాలీవుడ్ హాట్ బ్యూటీతో పవన్ కళ్యాణ్ రొమాన్స్...!?
పవన్ కళ్యాణ్ సినిమా కొత్తగా ఏది అనౌన్స్ అయినా కానీ అందులో హీరోయిన్ గా పలానా బాలీవుడ్ నటి నటిస్తోందనే ప్రచారం జరగడం సర్వ సాధారణమైపోయింది. అయితే చివరకు ఎవరో దక్షిణాది నటి లేదా ఊరు పేరు లేని నటిని ఖరారు చేస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ తో ఒకప్పటి బాలీవుడ్ సూపర్ స్టార్ అనిల్ కపూర్ కుమార్తె సోనమ్ కపూర్ నటిస్తోందనే ప్రచారం మొదలైంది. 2012సంవత్సరంలో పవన్ హీరోగా డివివి దానయ్య ఓ చిత్రం నిర్మిస్తున్నాడని చెప్పుకుంటూ ఉండడంతో అందులో హీరోయిన్ గా సోనమ్ కపూర్ నటిస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఓ సంచలన దర్శకుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడని, ఇప్పటికే అతనితో మంతనాలు జరిగిపోయాయని తెలిసింది. మరి ఈసారైనా ఈ బాలీవుడ్ హీరోయిన్ భాగోతం నిజమవుతుందో లేక యథాతథంగా పవన్ ఎవరో ఒక పాపులర్ దక్షిణాది నటితో సర్ధుకు పోతాడో చూడాల్సిందే.
కాగా సోనమ్ కపూర్ ను తెలుగులో నటింపజేయడానికి 2008లోనే ప్రయత్నించారని, అయితే అప్పటికే ఆమె హిందీలో చాలా బిజీ హీరోయిన్ అయిపోయిందని అప్పట్లో ఆ ప్రయత్నాన్ని విరమించుకొన్నారు. ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ కోసం ట్రై చేస్తున్నారని సమాచారం. అయితే హిందీలో ఆమె నటించిన ఏ సినిమాలూ ఒక్క హిట్ కూడా సాధించలేకపోయింది అందుకే తను సౌత్ మూవీస్ లో తన స్టార్ డమ్ మరియు సక్సెస్ కోసం ఎదురు చూస్తోందని సమాచారం.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్-శృతి హాసన్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం పూర్తి కాగానే వచ్చే వేసవికి ఆరంభం కానుందని ఇండస్ట్రీలో టాక్. సో పవన్ -సోనమ్ కపూర్ కాంబినేషన్ లో రాబోతున్న ఈ చిత్రానికి కోనవెంకట్ అద్భుతమైన స్ర్కిప్ట్ రెడీ చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం.


Click it and Unblock the Notifications











