Bheemla Nayak Postpone: భీమ్లా నాయక్ మళ్లీ వాయిదా.. మెగా హీరో నిర్ణయమే దీనికి సాక్ష్యం

కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోన్న చిత్రాల్లో 'భీమ్లా నాయక్' ఒకటి. టాలీవుడ్ టాప్ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - దగ్గుబాటి రానా ఇందులో కలిసి నటిస్తుండడంతో ఆరంభంలోనే ఇది అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆ తర్వాత ఈ చిత్రం నుంచి వచ్చిన పాటలు, టీజర్‌లకు భారీ స్థాయిలో రెస్పాన్స్ రావడంతో దీనికి విడుదలకు ముందే భారీ స్థాయిలో హైప్ క్రియేట్ అయింది. ఫలితంగా ఈ సినిమా హక్కులకు కూడా భారీ డిమాండ్ ఏర్పడింది. ఇక, ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఎన్నో రకాల పుకార్లు షికార్లు చేశాయి. ఈ నేపథ్యంతో 'భీమ్లా నాయక్'ను ఫిబ్రవరి 25న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, తాజాగా ఇది మళ్లీ వాయిదా పడిందని తెలుస్తోంది. ఆ వివరాలు మీకోసం!

Recommended Video

RRR, Bheemla Nayak Release Dates బాక్సాఫీస్ వార్ | Radhe Shyam | KGF 2 | Filmibeat Telugu
 వాళ్లిద్దరి కాంబోలో భీమ్లా నాయక్

వాళ్లిద్దరి కాంబోలో భీమ్లా నాయక్

పవన్ కల్యాణ్, దగ్గుబాటి రానా కలయికలో వస్తున్న భారీ మల్టీస్టారర్ మూవీనే ‘భీమ్లా నాయక్'. సాగర్ కే చంద్ర తెరకెక్కించిన ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు మాటలు, దర్శకత్వ పర్యవేక్షణ చేశాడు. థమన్ దీనికి సంగీతం అందించాడు. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో నిత్య మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు.

హాట్ షోతో షాకిచ్చిన ఈషా రెబ్బా: పైనుంచి చూపిస్తూ రెచ్చిపోయిన తెలుగు పిల్ల
https://telugu.filmibeat.com/heroine/eesha-rebba-saree-photos-viral-in-internet-107207.html

 ఇద్దరి మధ్యన ఆధిపత్య పోరుతో

ఇద్దరి మధ్యన ఆధిపత్య పోరుతో

మలయాళంలో వచ్చి హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియం'కు భీమ్లా నాయక్ రీమేక్‌గా రూపొందింది. ఈ మూవీ ఇగో ఉన్న ఓ పవర్‌ఫుల్ పోలీసు.. లోకల్ డాన్ మధ్య జరిగే ఆధిపత్య పోరుతో రూపొందింది. ఇందులో పోలీస్ ఆఫీసర్‌ పాత్రలో పవన్ కల్యాణ్.. లోకల్ డాన్‌గా దగ్గుబాటి రానా నటించారు. ఇప్పటికే వీళ్లిద్దరి పాత్రలకు సంబంధించిన లుక్స్‌కు భారీ స్పందన వచ్చింది.

 భారీ అంచనాలు.. బిజినెస్ ఇలా

భారీ అంచనాలు.. బిజినెస్ ఇలా

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ‘భీమ్లా నాయక్' ఫస్ట్ గ్లిమ్స్ ఆ మధ్య వచ్చింది. ఆ తర్వాత దగ్గుబాటి రానా గ్లిమ్స్ వీడియో కూడా రిలీజ్ అయింది. ఇవి అభిమానులతో పాటు సినీ ప్రియుల ఆదరణను అందుకున్నాయి. అలాగే, ఆ తర్వాత వచ్చిన పాటలకు కూడా భారీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ భారీ స్థాయిలో జరిగింది.

రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేశారుగా

రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేశారుగా

భారీ మల్టీస్టారర్‌గా రూపొందిన ‘భీమ్లా నాయక్' మూవీ విడుదల ఆంధ్రప్రదేశ్‌లో విధించిన నైట్ కర్ఫ్యూ, యాభై శాతం ఆక్యూపెన్సీ మీద ఆధారపడి ఉంటుందని నిర్మాత ప్రకటించాడు. ఈ క్రమంలోనే రెండు రిలీజ్ డేట్లను కూడా అనౌన్స్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సమ్మర్‌లో వస్తుందని అంతా అనుకున్నారు. కానీ, దీన్ని ఫిబ్రవరి 25నే రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

ప్రపంచ వ్యాప్తంగా భీమ్లా ఫీవర్

ప్రపంచ వ్యాప్తంగా భీమ్లా ఫీవర్

పవన్ కల్యాణ్ - దగ్గుబాటి రానా కలయికలో వస్తున్న ‘భీమ్లా నాయక్' మూవీని ఫిబ్రవరి 25న విడుదల చేస్తామని ప్రకటించారు. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అంతేకాదు, ఈ రిలీజ్‌ను పండుగలా జరుపుకోవాలి ప్లాన్ చేస్తున్నారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా భీమ్లా నాయక్ ఫీవర్ కనిపిస్తోంది. చాలా చోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయిన విషయం తెలిసిందే.

 మరోసారి వాయిదా పడ్డ సినిమా

మరోసారి వాయిదా పడ్డ సినిమా

‘భీమ్లా నాయక్' మూవీ విడుదలకు మరో వారం రోజులు మాత్రమే సమయం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ చిత్రం మరోసారి వాయిదా పడబోతుందని తాజాగా ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోంది. అంతేకాదు, గురువారం లేదా శుక్రవారం దీనిపై అధికారిక ప్రకటన చేయబోతున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. దీంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.

 మెగా హీరో తీరే దీనికి సాక్ష్యంగా

మెగా హీరో తీరే దీనికి సాక్ష్యంగా

‘భీమ్లా నాయక్' వాయిదా పడుతుందా లేదా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మారింది. మరోవైపు అదే రోజున వరుణ్ తేజ్ ‘గని' మూవీ విడుదల కాబోతుంది. ఒకవేళ పవన్ సినిమా ఉంటే ఇది వాయిదా పడాలి. కానీ, వరుణ్ మాత్రం ముందుకు దూసుకెళ్తున్నాడు. దీంతో ‘భీమ్లా నాయక్' వాయిదా పడుతుందని తెలవడం వల్లే ‘గని' ముందుకెళ్తున్నాడని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X