Bheemla Nayak OTT: ఒకేసారి రెండు ఓటీటీల్లో భీమ్లా నాయక్.. టాలీవుడ్ చరిత్రలో రికార్డు

కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగిపోతోన్న పేర్లలో 'భీమ్లా నాయక్' ఒకటి. అంతలా ఈ సినిమా నిర్మాణ దశలో ఉండగానే ప్రభావాన్ని చూపించింది. అప్పటి నుంచి నిత్యం ఏదో ఒక విధంగా హాట్ టాపిక్ అవుతూనే వస్తోంది. ఇక, ఈ మధ్య ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని ప్రకటించిన తర్వాత దీని హడావిడి మరింత ఎక్కువైంది. అందుకే ట్విట్టర్‌లో సుదీర్ఘ కాలంగా ఈ మూవీ ట్రెండ్ అవుతూనే ఉందంటే.. ఇది ఏ రేంజ్‌లో హవాను చూపిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉండగా.. 'భీమ్లా నాయక్' మూవీ డిజిటల్ హక్కుల గురించి తాజాగా బయటకు వచ్చిన న్యూస్ సంచలనం అవుతోంది. దీనికి కారణం దీన్ని రెండు ఓటీటీల్లో విడుదల చేస్తుండడమే. ఆ వివరాలు మీకోసం!

ఇద్దరు హీరోల కలయికలో భీమ్లా

ఇద్దరు హీరోల కలయికలో భీమ్లా

బడా హీరోలు పవన్ కల్యాణ్, దగ్గుబాటి రానా కలయికలో రూపిందిన చిత్రమే 'భీమ్లా నాయక్'. సాగర్ కే చంద్ర రూపొందించిన ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మూవీకి మాటలు, దర్శకత్వ పర్యవేక్షణ చేశాడు. థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చాడు. ఇక, ఈ భారీ సినిమాలో నిత్య మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు.

 సినిమా కథ.. హీరోల పాత్రలిలా

సినిమా కథ.. హీరోల పాత్రలిలా

మలయాళంలో వచ్చిన 'అయ్యప్పనుమ్ కోషియం'కు భీమ్లా నాయక్ మూవీ రీమేక్‌గా రూపొందింది. ఇగో ఉన్న ఓ పవర్‌ఫుల్ పోలీసు.. లోకల్ మాఫియా డాన్ మధ్య జరిగే ఆధిపత్య పోరుతో ఇది తెరకెక్కింది. ఇందులో పోలీస్ పాత్రలో పవన్ కల్యాణ్.. లోకల్ డాన్‌గా దగ్గుబాటి రానా పాత్రలు పోషించారు. ఇప్పటికే వీళ్లిద్దరి పాత్రలకు సంబంధించిన లుక్స్‌ను కూడా రివీల్ చేసేశారు.

 బిజినెస్‌తో భీమ్లా హాట్ టాపిక్‌గా

బిజినెస్‌తో భీమ్లా హాట్ టాపిక్‌గా

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'భీమ్లా నాయక్' మూవీ ఫస్ట్ గ్లిమ్స్ ఆ మధ్య వచ్చింది. ఆ తర్వాత దగ్గుబాటి రానా గ్లిమ్స్ వీడియో కూడా రిలీజ్ అయింది. వీటితో పాటు ఆ తర్వాత వచ్చిన పాటలు కూడా వచ్చి భారీ రెస్పాన్స్‌ను అందుకున్నాయి. దీంతో ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ భారీ రేంజ్‌లో అయింది. ఇలా కూడా భీమ్లా రికార్డు నమోదు చేసింది.

 రిలీజ్ డేట్.. మారుమ్రోగుతూనే

రిలీజ్ డేట్.. మారుమ్రోగుతూనే

పవన్ కల్యాణ్ - రానా కాంబోలో తెరకెక్కిన 'భీమ్లా నాయక్' మూవీ విడుదలపై చాలా రోజుల పాటు సందిగ్ధత నెలకొంది. దీంతో ఇది ఇప్పుడు వస్తుందని ఎవరూ అనుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఊహించని విధంగా దీన్ని ఫిబ్రవరి 25నే రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు. ఇక, అప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా భీమ్లా నాయక్ నామస్మరణ రోజురోజుకు పెరుగుతూనే ఉంది.

ఆ ఓటీటీకి భీమ్లా నాయక్ రైట్స్

ఆ ఓటీటీకి భీమ్లా నాయక్ రైట్స్

ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండడంతో పాటు విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ చేసుకున్న 'భీమ్లా నాయక్' హక్కులకు భారీ పోటీ నెలకొంది. దీంతో ఈ సినిమా డిజిటల్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసిందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. సినిమా వచ్చిన యాభై రోజులకు స్ట్రీమింగ్ చేయనున్నారని కూడా ప్రచారం జరిగింది.

 మరో ఓటీటీలోనూ స్టీమింగ్ అని

మరో ఓటీటీలోనూ స్టీమింగ్ అని

'భీమ్లా నాయక్' మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ గురించి తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఈ సినిమాను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌తో పాటు తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలోనూ స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఈ మేరకు రెండు సంస్థలు చిత్ర యూనిట్‌తో ఒప్పందం చేసుకున్నాయని తెలిసింది. టాలీవుడ్‌లో గతంలో ఇలా ఎప్పుడూ జరగలేదన్నది తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X