ఇకపై పవన్ కళ్యాణ్ ఆల్ రౌండర్! రామ్ చరణ్‌ గురించి క్లారిటీ ఇచ్చిన పవర్ స్టార్

మెగా హీరోల్లోకెల్లా తనకంటూ ఓ ప్రత్యేక ఫాలోయింగ్ కూడగట్టుకున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. వరుస సినిమాలతో స్టార్ హీరోగా ఎదిగిన ఈయన ఇటీవలే జనసేన పార్టీ స్థాపించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా మారారు. దీంతో ఇక పవన్ కళ్యాణ్ సినీ ఇండస్ట్రీ వైపు చూడరని అంతా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా పవన్ చెప్పిన ఓ విషయం మెగా అభిమానుల్లో సంబరాలు నింపింది. వివరాల్లోకిపోతే..

మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. హాట్ టాపిక్

మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. హాట్ టాపిక్

రాజకీయాల కారణంగా కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు పవన్.ఇటీవలే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీయే ఎన్నికల్లో పోటీచేసిన ఈయన, గెలవనప్పటికీ.. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇదిలా ఉంటే పవన్ ఫ్యాన్స్ మాత్రం తమ అభిమాన హీరో సినిమాలు చేయాలని కోరుకుంటున్నారు. ఇది గమనించిన జనసేనాని.. మెగా అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పడం హాట్ టాపిక్ అయింది.

రామ్ చరణ్‌తో సినిమా పక్కాగా ఉంటుంది

రామ్ చరణ్‌తో సినిమా పక్కాగా ఉంటుంది

టాలీవుడ్‌లో సినిమాలు నిర్మిస్తానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ మేరకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో సినిమా పక్కాగా ఉంటుందని అన్నారు. సరైన కథ, సరైన దర్శకుడు దొరకకపోవడం వల్లనే ఈ మూవీ ఆలస్యమవుతూ వస్తోందని, అతి త్వరలోనే రామ్ చరణ్‌తో సినిమా పట్టాలెక్కుతుందని పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చేశారు.

పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ..

పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ..

ఓ వైపు రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ మరోవైపు సినిమాల్లోకి కూడా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారని వార్తలు వస్తున్నాయి. 'అజ్ఞాతవాసి' సినిమా తర్వాత రాజకీయబాట పట్టిన ఆయన.. తిరిగి వెండితెరపై కాలు మోపనున్నారని తెలుస్తోంది. 'పింక్' సినిమా రీమేక్ ద్వారా పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఖాయమైందని తెలిసింది.

అతిత్వరలో ప్రారంభం.. థమన్ బాణీలు

అతిత్వరలో ప్రారంభం.. థమన్ బాణీలు

పవన్ కళ్యాణ్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కనున్న పింక్ రీమేక్ సినిమా అతిత్వరలో ప్రారంభం కానుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై 40వ ప్రాజెక్టుగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించనున్నారు. థమన్ బాణీలు కట్టనున్నారు.

ఆల్ రౌండర్ పవన్ కళ్యాణ్

ఆల్ రౌండర్ పవన్ కళ్యాణ్

ఈ లెక్కన చూస్తుంటే రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ ఆల్ రౌండ్ ప్రతిభ కనబర్చనున్నారని చెప్పుకోవచ్చు. ఓ వైపు రాజకీయాలు, మరోవైపు సినిమాలు.. సినిమాల నిర్మాణం లాంటి పనులతో పవన్ హంగామా చేయనున్నారన్నమాట. ఏదేమైనా జనసేనాని తీసుకుంటున్న ఈ నిర్ణయం స్వాగతిస్తున్నారు మెగా అభిమానులు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X