twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నెలాఖరుకే పవన్ కళ్యాణ్...ముహూర్తం??

    By Srikanya
    |

    హైదరాబాద్ : పవన్‌కల్యాణ్‌ 'అత్తారింటికి దారేది' ప్రేక్షకుల ముందుకొచ్చి చాలా రోజులైంది. ఇటీవలే అభిమానులు ఆ సినిమా వంద రోజుల వేడుక కూడా చేసుకొన్నారు. అయితే ఆయన కొత్త సినిమా 'గబ్బర్‌సింగ్‌2' మాత్రం ఇప్పటికీ ప్రారంభం కాలేదు. 'అత్తారింటికి దారేది' సెట్స్‌పై ఉన్నప్పట్నుంచే రెండో గబ్బర్‌సింగ్‌ కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. అయినా పనులు తెమల్లేదు.

    హీరోయిన్ ఎంపిక పూర్తి కాకపోవడంతోనే ఈ సినిమా ఆలస్యమైందని ప్రచారం సాగుతోంది. అయితే ఈ నెలాఖరులోగానీ, వచ్చే నెలలోగానీ ఆ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లాలని యూనిట్ నిర్ణయించుకొన్నట్టు తెలిసింది. సంపత్‌ నంది దర్శకత్వం వహించబోతున్నారు.

    Pawan Kalyan's ‘Gabbar Singh 2′latest info.

    సినిమా మొదలైన తర్వాత....అంతా ప్లానింగ్ ప్రకారం, అనుకున్న రోజు అనుకున్న షెడ్యూల్ పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. విడుదల తేదీ విషయంలో కూడా ముందుగానే ఓ నిర్ణయానికి వచ్చారు. 2012లో వచ్చిన 'గబ్బర్ సింగ్' చిత్రం విడుదలైన తేదీనే అంటే...మే 11, 2014న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

    గబ్బర్ సింగ్ తొలి భాగం గుంటూరు జిల్లా కొండవీడు నేపథ్యంలో సాగిన సంగతి తెలిసిందే. ఈచిత్రంలో పవన్ కళ్యాణ్ వెంకట రత్నం నాయుడు అలియాస్ గబ్బర్ సింగ్‌గా దర్శనమిచ్చారు......సీక్వెల్ గబ్బర్ సింగ్ 2లోనూ పవన్ క్యారెక్టర్ అదే అయినప్పటికీ, సినిమా మధ్య ప్రదేశ్‌లోని చంబల్ లోయ నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది.

    ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నటించేది ఎవరు? అనేది ఇంకా ఖరారు కాలేదు. త్వరలో సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని పవన్ కళ్యాన్ స్నేహితుడు శరత్ మరార్ నిర్మిస్తున్నారు. గబ్బర్ సింగ్ చిత్రం భారీ విజయం సాధించి నేపథ్యంలో సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

    English summary
    
 Pawan Kalyan's ‘Gabbar Singh 2′ delay due to various reasons. First is the script of the film has not yet completed and Pawan Kalyan is asking better version of Sampath Nandi .
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X