పవన్ కళ్యాణ్ కోసం రూ. 6.6 లక్షల బైక్
హైదరాబాద్: హిందీలో సూపర్ హిట్ అయిన 'ఓ మై గాడ్' చిత్రాన్ని తెలుగులో 'గోపాలా గోపాలా' పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. హిందీలో అక్షయ్ కుమార్ పోషించిన పాత్రను తెలుగులో పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. పరేష్ రావల్ చేసిన పాత్రను వెంకటేష్ చేస్తున్నారు.
హిందీ వెర్షన్లో కొన్ని సీన్లలో అక్షయ్ కుమార్ బైక్‌పై కనిపిస్తారు. తెలుగులో కూడా పవన్ కళ్యాణ్ కొన్ని సీన్లలో బైక్‌పై కనిపిస్తారు. పవన్ కళ్యాణ్ కోసం ఈ చిత్రంలో రూ. 6.6 లక్షల విలువ చేసే 'హైసంగ్ జివి 650 ఆక్విలా ప్రో' బైకు వాడుతున్నట్లు తెలుస్తోంది.

ఇటీవలే ప్రారంభోత్సవం జరుపుకున్న 'గోపాలా గోపాలా' షూటింగ్ ప్రస్తుతం కొనసాగుతోంది. వెంకటేష్, ఇతర తారాగణంపై సీన్లు చిత్రీకరిస్తున్నారు. త్వరలో పవన్ కళ్యాణ్ కూడా షూటింగులో జాయిన్ అవుతారు.
సినిమాలో వెంకీ పాత్ర పేరు గోపాల్. పవన్ పోషించేది కూడా గోపాలుడి(కృష్ణుడి) పాత్రే కాబట్టి 'గోపాల గోపాల' టైటిల్ ఫైనల్ చేసారు. వెంకటేష్ సరసన శ్రియ నటిస్తోంది. కిషోర్ పార్థసాని (డాలి) దర్శకత్వం వహిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. డి.సురేష్‌బాబు, శరత్‌మరార్ నిర్మాతలు. ఈ చిత్రంలో మిథున్ చక్రవర్తి, పోసాని కృష్ణమురళి, కృష్ణుడు, రఘుబాబు, దీక్షాపంత్, అంజు అస్రాని తదితరులు ఇతర పాత్రధారులు. చిత్రానికి మాటలు: సాయిమాధవ్ బుర్రా, ఛాయాగ్రహణం: జయనన్ విన్సెంట్, సంగీతం: అనూప్ రూబెన్స్, కూర్పు: గౌతంరాజు, కళ: బ్రహ్మ కడలి.


Click it and Unblock the Notifications











