‘హరిహర వీరమల్లు’ నుంచి షాకింగ్ న్యూస్: పవన్‌తో ఒకరు.. పవన్‌లా మరొకరు.. అదే హైలైట్ అంటున్నారే!

దాదాపు రెండు దశాబ్దాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో హవాను చూపిస్తోన్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకడు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినిమాల్లోకి ప్రవేశించినప్పటికీ.. అద్భుతమైన టాలెంట్‌తో తనకంటూ ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. ఇక, రాజకీయాల కోసం సినిమాలకు బ్రేకిచ్చిన పవన్.. 'వకీల్ సాబ్'తో రీఎంట్రీ ఇస్తున్నాడు. దీని తర్వాత క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో 'హరిహర వీరమల్లు' అనే మూవీ చేస్తున్నాడు. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఆ విశేషాలేంటో చూద్దాం పదండి!

కెరీర్‌లో తొలిసారి అలాంటి సినిమాలో పవన్

కెరీర్‌లో తొలిసారి అలాంటి సినిమాలో పవన్

రీఎంట్రీలో ఫుల్ స్పీడు చూపిస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఇప్పటికే పింక్ రీమేక్‌గా వస్తున్న 'వకీల్ సాబ్'లో నటించిన అతడు.. అది విడుదల కాకముందే క్రిష్ జాగర్లమూడితో 'హరిహర వీరమల్లు' చేస్తున్నాడు. దీని ద్వారా కెరీర్‌లోనే మొదటిసారి పిరియాడిక్ జోనర్‌ను టచ్ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎమ్ రత్నం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

అన్ని రకాల సెట్‌లు.. మొదటిసారి ఆ రేంజ్

అన్ని రకాల సెట్‌లు.. మొదటిసారి ఆ రేంజ్

మొగల్ సామ్రాజ్యం నాటి కథతో తెరకెక్కుతోంది 'హరిహర వీరమల్లు'. ఈ చిత్రం కోసం చార్మినార్, ఎర్రకోటతో పాటు మొగలాయీల సామ్రాజ్యపు ప్రాంగణాన్ని నిర్మించబోతున్నారట. ఇందుకోసం ఏకంగా రూ. 180 కోట్ల వరకూ ఖర్చు చేయబోతున్నారని తెలుస్తోంది. అంతేకాదు, కోహినూర్ డైమండ్ చుట్టూ తిరిగే ఈ సినిమాను తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో తీస్తున్నారు.

కొత్త గెటప్‌లో పవర్ స్టార్.. అన్నీ నేర్చుకుని

కొత్త గెటప్‌లో పవర్ స్టార్.. అన్నీ నేర్చుకుని

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'హరిహర వీరమల్లు'లో పవన్ కల్యాణ్ వజ్రాల దొంగగా నటిస్తున్నాడు. అందుకే ఈ మూవీ కోసం అతడు గుర్రపు స్వారీతో పాటు కత్తి, కర్రసాములు కూడా చేయబోతున్నాడని అంటున్నారు. అంతేకాదు, అతనకెంతో ఇష్టమైన గన్ షూటింగ్ కూడా ఇందులో ఉంటుందని తెలుస్తోంది. ఇక, ఈ సినిమా కోసం పవన్ కొన్ని రిస్కీ షాట్స్ కూడా చేస్తున్నాడట.

టైటిల్ గ్లిమ్స్... ఊహించని రీతిలో రెస్పాన్స్

టైటిల్ గ్లిమ్స్... ఊహించని రీతిలో రెస్పాన్స్

వాస్తవానికి క్రిష్ జాగర్లమూడి - పవన్ కల్యాణ్ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాకు మొదట్లో 'విరూపాక్ష' అనే టైటిల్ అనుకున్నారు. కానీ, దీనికి 'హరిహర వీరమల్లు' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను మహా శివరాత్రి సందర్భంగా గురువారం విడుదల చేశారు. ఈ టైటిల్ గ్లిమ్స్‌కు ఊహించని రీతిలో స్పందన రావడంతో ఎన్నో రికార్డులు బద్దలైపోయాయి.

‘హరిహర వీరమల్లు’ నుంచి షాకింగ్ న్యూస్

‘హరిహర వీరమల్లు’ నుంచి షాకింగ్ న్యూస్

పవన్ కల్యాణ్ ప్రస్తుతం నటిస్తోన్న 27వ చిత్రం 'హరిహర వీరమల్లు' రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాలతో పాటు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. దీంతో దీనికి సంబంధించిన ఎన్నో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఇందులో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ దొంగగా కనిపించనుందట.

పవన్‌తో ఒకరు.. పవన్‌లా మరొకరు.. హైలైట్

పవన్‌తో ఒకరు.. పవన్‌లా మరొకరు.. హైలైట్

'హరిహర వీరమల్లు'లో శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మెయిన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈమె మొగల్ చక్రవర్తి ఔరంగజేబు సోదరిగా చేస్తుందట. హీరోను చూసిన వెంటనే ప్రేమలో పడి అతడితోనే వెళ్లిపోతుందని అంటున్నారు. అలాగే, నిధి అగర్వాల్ సామ్రాజ్యంలో ఆట దొంగగా చేస్తుందట. ఈ క్రమంలోనే ఓ సందర్భంలో పవన్‌తోనే ఫైట్ చేస్తుందని, అది హైలైట్‌గా ఉంటుందని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X