పవన్ కళ్యాణ్ ఇంటిని టార్గెట్ చేసారా?
హైదరాబాద్: జీహెచ్ఎంసీ వారు హైదరాబాద్ లోని అక్రమ కట్టడాలపై కొరడా ఝులిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఎవరినీ వదలడం లేదు. ఇటీవల సినీ నటుడు వెంకటేష్ తన స్థలంలో అనుమతి లేకుండా నిర్మించిన షెడ్డుపై నోటీసులు జారీ చేయగా స్వయంగా వెంకటేష్ దాన్ని కూల్చి వేయించారు.
అయితే తాజాగా పవన్ కళ్యాన్ కు చెందిన బిల్డింగు కూడా కొంత మేర కూల్చి వేసినట్లు ప్రాచరం జరుగుతోంది. ఇపుడు ఇదో హాట్ టాపిక్ అయింది. అయితే కూల్చివేత వెనక జీహెచ్ఎంసీ నోటీసులు ఉన్నాయా? లేక పవన్ కళ్యాణ్ స్వయంగా ఇంటికి వాస్తు మార్పుల్లో భాగంగా ఇలా చేయిస్తున్నారా? అనేది తేలాల్సి ఉంది.

పవన్ కళ్యాణ్ సినిమా విషయానికొస్తే...
ప్రస్తుతం ఆయన ‘గోపాల గోపాల' చిత్రంలో నటిస్తున్నారు. పవన్ కళ్యాణ్, వెంకటేష్ మల్టీ స్టారర్ గా నటిస్తున్న 'గోపాల గోపాల' చిత్రం ఆడియో ఈ నెలలో విడుదల కానుంది. బహుషా డిసెంబర్ 28న ఉండొచ్చని టాక్. అయితే ఈ చిత్రం ఆడియో వేడుక రొటీన్ ఆడియో వేడుకల్లా కాకుండా డిఫరెంటుగా నిర్వమించేందుకు ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే అందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.
హిందీ చిత్రం ‘ఓ మై గాడ్'కు రీమేక్ ఇది. డాలీ దర్శకత్వం వహిస్తున్నారు. డి.సురేశ్‌బాబు, శరత్‌మరార్ నిర్మాతలు. సురేశ్ ప్రొడక్షన్స్, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. విక్టరీ వెంకటేష్, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ మల్టీస్టారర్‌గా నటిస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్ర నిర్మాణంలో ఎక్కడ తగ్గకుండా సినిమాను తీశామని నిర్మాతలు డి.సురేష్‌బాబు, శరత్‌మారార్‌లు తెలిపారు. డాలి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.


Click it and Unblock the Notifications











