జనసేన పార్టీ ఎఫెక్ట్: పవన్ కళ్యాణ్ ఆ సినిమా చేయడా?

By Bojja Kumar

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ‘కోబలి' అనే సినిమా వచ్చే అవకాశం ఉందని అప్పట్లో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. రాయలసీమ బ్యాక్ డ్రాపులో సాగే ఈ చిత్రాన్ని స్వయంగా పవన్ కళ్యాణ్ నిర్మిస్తారని అన్నారు. తాజా పరిస్థితి గమనిస్తే ఈచిత్రం ఇక అటకెక్కినట్లే, పూర్తిగా రద్దయినట్లే అని అంటున్నారు.

చాలా కాలం క్రితమే ‘కోబలి' సినిమా ప్లాన్ చేసారు. అయితే ఆ తర్వాత పరిస్థితులు అనుకూలించలేదు. త్రివిక్రమ్ ఇతర సినిమాలతో బిజీ అయ్యారు. వచ్చే ఏడాది(2015) ఆయన మహేష్ బాబుతో సినిమా తీయబోతున్నారు. మరో వైపు పవన్ కళ్యాణ్ ‘గోపాల గోపాల' సినిమా పూర్తి చేసి ‘గబ్బర్ సింగ్-2' చిత్రం చేయాల్సి ఉంది.

Pawan Kalyan's Kobali shelved?

ఆ తర్వాత అయినా పవన్ కళ్యాణ్ చేస్తాడా? అంటే డౌటే అంటున్నారు. ఎందుకంటే ఇటీవల పవన్ కళ్యాణ్ స్థాపించిన ‘జనసేన' పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపు లభించింది. ప్రస్తుతం ఆయన తన చేతిలో ఉన్న సినిమాలు పూర్తయిన తర్వాత పార్టీపై దృష్టి పెడతారని అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ‘జనసేన' పార్టీని గ్రామస్థాయి నుండి బలోపేతం దిశగా ఆయన అడుగు వేసే అవకాశం ఉందని అంటున్నారు. ఈ పరిణామాలన్నింటి దృష్ట్యా ‘కోబలి' సినిమా ఇక ఉండక పోవచ్చని ఫిల్మ్ నగర్ జనాలు చర్చించుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X