ప్చ్...పవన్ కళ్యాణ్ భజన వర్కవుట్ కాలేదు

By Srikanya

హైదరాబాద్ : తమ సినిమాలో పవన్ కళ్యాణ్ కి చెందిన పాటో,డైలాగో , లేక పవన్ ఫొటోనో, పవన్ ఉన్న సీనో పెడితే హిట్టైపోతుందనే నమ్మకాలు తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ మధ్యకాలంలో బాగా పెరిగిపోయాయి. దానికి ప్రత్యక్ష్య ఉదాహరణ ఈ వారంలో విడుదలైన రెండు చిత్రాల్లోనూ పవన్ కళ్యాణ్ భజన ఉండటమే. పవన్ ని అభిమానించటం వేరు దాన్ని క్యాష్ చేసుకునే విధంగా తమ సినిమాలో ఎక్కడో చోట పవన్ కి సంభందించిన మ్యాటర్ ఇరికించటం వేరు. తాజాగా విడుదలైన గీతాంజలి, గాలిపటం రెండు చిత్రాల్లోనూ అదే జరిగింది.

గాలిపటం లో ఏకంగా పవన్ కళ్యాణ్ అభిమానిగా హీరోని చూపెట్టి..పవన్ కళ్యాణ్ గురించి ఇంటర్వూలో అడిగితే సమాధానం కరెక్టుగా చెప్పాడని అతనికి ఉద్యోగం ఇచ్చారనే సీన్ ని సైతం పెట్టేసారు. అలాగే చాలా చోట్ల పవన్ ఇమేజ్ ని వాడుకోవాలని విశ్వప్రయత్నం చేసారు. అయితే ఆ ఎఫెక్టు సినిమా ఫలితం పై పడలేదు. సినిమాకు కొద్దిగా కూడా వర్కవుట్ కాలేదు. సినిమా ఫ్లాఫ్ టాక్ నుంచి కాపాడలేకపోయింది.

Pawan Kalyan’s name in movies is not happening.

అలాగే...పవన్ కళ్యాణ్ కి సన్నిహితుడైన కోన వెంకట్ తన తాజా చిత్రం గీతాంజలిలోనూ పవన్ కల్యాణ్ నామ స్మరణ చాలా చోట్ల చేసారు. అయితే అదీ అనుకున్నంతగా వర్కవుట్ కాలేదు. థియోటర్ లో ఉన్న పవన్ అబిమానులు..ఆ క్షణం విజిల్స్ వేస్తారు కానీ తర్వాత దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయరనే విషయం మర్చిపోతున్నారు దర్శక,నిర్మాతలు.

పవన్ కి వీరాభిమాని అయిన నితిన్..తన ఇష్క్ చిత్రంలో పవన్ కి చెందిన ప్రస్దావన తెచ్చినప్పటినుంచీ అది హిట్టవటంతో కథ, కథనం, మిగతా ఎలిమెంట్స్ కన్నా పవన్ కళ్యాణ్ ప్రస్దావన ఎక్కడ ఇరికిద్దామా అనే ఆలోచన మేకర్స్ లో పెరిగిపోయింది. అయితే ప్రేక్షకులు, అభిమానులు అంత గమనించలేని స్ధితిలో లేరనే విషయం మర్చిపోతున్నారు. పవన్ ఆడియో విడుదల చేసిన అలీ చిత్రం అలీ బాబా ఒక్కడే దొంగ అయితే డిజాస్టర్ అయ్యింది. సినిమాలో విషయం ఉంటే..పవన్ మ్యాజిక్ ఉపయోగపడుతుందే విషయం గమనించుకోవాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X